సన్నీ డియోల్ యాక్షన్ మూవీ "జాట్" ఏప్రిల్ 10న విడుదల!

బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'జాట్'. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం.
రిలీజ్ డేట్ పోస్టర్‌లో సన్నీ డియోల్ ఇంటెన్స్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో కనిపించారు. భుజంపై భారీ తుపాకీతో ఫెరోషియస్ గా ముందుకు సాగుతున్నాడు. బ్యాక్ డ్రాప్ లో హెలికాప్టర్, కరెన్సీ నోట్లు గాలిలో ఎగురుతున్నాయి. స్టైల్, స్వాగర్‌ను ప్రజెంట్ చేసిన సన్నీ డియోల్ లుక్ అదిరిపోయింది, ఈ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కాసాండ్రా కీలక పాత్రలు పోహిస్తున్నారు.
"జాట్" చిత్రానికి సంగీతం థమన్ ఎస్, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. అనల్ అరసు, రామ్ లక్ష్మణ్, వెంకట్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు సమకూరుస్తున్నారు.