‘ఒక పథకం ప్రకారం’ విలన్‌ను కనిపెట్టండి!

దర్శకుడు పూరి జగన్నాధ్ సొదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ "ఒక పథకం ప్రకారం". గార్లపాటి రమేష్ వినోద్ కుమార్ నిర్మాతలు. విజయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దర్శక నిర్మాత వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమాను ఇంటర్వెల్ వరకు చూసి... విలన్ ఎవరో చెప్పగిలిగినవారికి... 50 థియేటర్ల నుంచి.. థియేటర్ కి ఒకరు చొప్పున 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున బహుమతి అందిస్తామని హీరో సాయిరామ్ శంకర్ ప్రకటించారు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించినప్పటికీ... విలన్ ఎవరో.. ఎవరొకాని కనిపెట్టలేరని తాము భావిస్తున్నామని, అయితే 50 మంది విజేతలకు 10 వేల రూపాయల చొప్పున 5 లక్షలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. ఒక పథకం ప్రకారం చిత్రంలో ప్రతి మూడు నాలుగు సీన్స్ కు ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇందులో ఉన్న రెండు పాటలూ కథను ముందుకు తీసుకువెళ్లేలా ఉంటాయి అని పేర్కొన్నారు!!
బాపిరాజు మాట్లాడుతూ... ఇటీవలకాలంలో రానంత ఒక మంచి చిత్రాన్ని మా లక్ష్మీ ఫిలిమ్స్ ద్వారా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా 300 థియేటర్లలో విడుదల చేసే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు!!
సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ... "ఇది నా కెరీర్ కి ఎంతో హెల్పయ్యే సినిమా. నాకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ ఆవుతుంది. ఇందులో నేను సీదార్ధ నీలకంఠ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నటించాను. నా నటనలో చిన్నపాటి కృత్రిమత్వం కూడా ఉండకూడదని నెలరోజులపాటు నేషననల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని నటించాను. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ లో చాలామంది నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఉన్నారు. నేను మళ్ళీ భవిష్యత్తులో ఇంతటి టెక్నీకల్లీ రిచ్ ఫిల్మ్ లో నటించే ఛాన్స్ వస్తుందని నేననుకోను. ఈ చిత్రం ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయదు. ఇది నా హామీ'' అన్నారు.