జీ తెలుగు నూతన సంవత్సర వేడుక ‘సరిగమప పార్టీకి వేళాయెరా’.. ఈ శనివారం మన ఖమ్మంలో!
హైదరాబాద్, 20 డిసెంబర్ 2024: ఎప్పటికప్పుడు ఆకట్టుకునే సీరియల్స్, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. సందర్భానికనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. జీ తెలుగు సరిగమప గాయనీగాయకులు, నటీనటులు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ అంటూ అభిమానులను పలకరించేందుకు వచ్చేస్తున్నారు ఖమ్మం వచ్చేస్తున్నారు. జీ తెలుగు నిర్వహిస్తున్న నూతన సంవత్సర సరదా సంబరం ‘సరిగమప పార్టీకి వేళాయెరా’, డిసెంబర్ 21, శనివారం సాయంత్రం 5 గంటలకు.. మన ఖమ్మంలో!
ప్రతి పండుగకి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినోదాన్ని రెట్టింపు చేసే జీ తెలుగు నూతన సంవత్సర వేడుకను జరిపేందుకు సిద్ధమైంది. ఖమ్మంలోని SR & BGNR ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వేదికగా జీ తెలుగు ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమం జరగనుంది. ఎనర్జిటిక్ యాంకర్స్ రవి, లాస్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. జీ తెలుగు పాపులర్ సింగింగ్ షో సరిగమప నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ గాయనీ గాయకులతో పాటు మెంటర్ అనుదీప్, మీ అభిమాన జీ తెలుగు సీరియల్స్ నటీనటులైన మేఘసందేశం అభినవ్(గగన్), గౌరి(భూమి), నిండు నూరేళ్ల సావాసం అమరేంద్ర(రిచర్డ్ జోస్), అరుంధతి(పల్లవి గౌడ), భాగమతి(నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మిత్ర(రఘు), లక్ష్మీ(మహీ గౌతమి)తో పాటు లిఖితా మూర్తి, శోభా శెట్టి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అలరించనున్నారు. హృదయాన్ని హత్తుకునే పాటలు, అలరించే ఆటలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే 2025 సంవత్సరానికి జీ తెలుగు ఆహ్వానం పలుకుతోంది.
అభిమానుల సందడితో కోలాహలంగా సాగనున్న ఈ కార్యక్రమంలో గాయనీగాయకులు, నటీనటులు వేరు వేరు జట్లుగా పోటీపడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాటల పోటీలు, కామెడీ స్కిట్లు, ఫన్నీ అవార్డ్స్, అందాల పోటీలు, అద్భుతమైన ప్రదర్శనలు వంటి వాటితో వినోదం అందించడంతోపాటు ప్రతిభావంతులైన వికలాంగులను ప్రోత్సహించనుంది జీ తెలుగు. బుల్లితెరపై తమ ప్రతిభతో అలరిస్తున్న జీ తెలుగు తారలు, గాయనీగాయకులు తమ అభిమానులతో కలిసి నూతన సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికేందుకు వచ్చేస్తున్నారు. మరి మీరూ జీ తెలుగు నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర సంబరాల్లో భాగమవ్వండి.
నూతన సంవత్సరానికి జీ తెలుగు ఘన స్వాగతం ‘సరిగమప పార్టీకి వేళాయెరా’.. ఈ శనివారం సాయంత్రం 5 గంటలకు, మన ఖమ్మంలో.. తప్పక పాల్గొనండి!