హైదరాబాద్‌లో రెండు కొత్త బిర్లా ఓపస్ పెయింట్స్ ఫ్రాంఛైజీ స్టోర్‌లు

Related image


~ తెలంగాణాలోని హైదరాబాద్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీ స్టోర్‌ల ప్రారంభోత్సవంతో బిర్లా ఓపస్ పెయింట్స్ భారతదేశంలోని డెకరేటివ్ పెయింట్స్ విభాగంలో తన ప్రణాళికాబద్ధమైన వృద్ధిని కొనసాగిస్తోంది ~

9 డిసెంబరు 2024, హైదరాబాద్: గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్ - ఆదిత్య బిర్లా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ కాగా, ఈ వారం తెలంగాణలోని హైదరాబాద్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీ స్టోర్లను ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ బ్రాండ్ తన మొదటి స్టోర్స్‌ను ఇస్మత్ నగర్, మణికొండ, రసూల్‌పురా మరియు బండ్లగూడ జాగీర్‌లలో ప్రారంభించింది. ఇప్పుడు హైదరాబాద్‌లో రెండు అదనపు ఫ్రాంఛైజీ స్టోర్‌లను ప్రారంభించడం ద్వారా తెలంగాణలో తన అడుగుజాడలను మరింత విస్తరించింది. గచ్చిబౌలి క్రాస్ రోడ్‌లోని శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీస్, మేడ్చల్ మల్కాజిగిరిలోని చౌదరి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో ఈ రెండు నూతన స్టోర్లు.
ఈ ఫ్రాంఛైజీ స్టోర్లలో బిర్లా ఓపస్ పెయింట్స్‌కు చెందిన ఉత్పత్తులకు సమగ్ర కేంద్రాలుగా పనిచేస్తాయి. ఈ ప్రాంతానికి చెందిన ఘన వారసత్వం, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే వినియోగదారులకు విస్తృత శ్రేణి షేడ్స్‌ను అందిస్తాయి. వినియోగదారుల సంతృప్తికి పెద్ద పీట వేస్తూ, ఈ స్టోర్‌లు వినియోగదారులు తమకు కావలసిన పరిపూర్ణ వర్ణాలు, ఉత్పత్తులను కనుగొనేందుకు సహాయపడటానికి టెక్స్‌చర్ డిస్‌ప్లేలు, షేడ్ డెక్‌లు మరియు నిపుణుల సంప్రదింపులతో ఆకర్షణీయమైన షాపింగ్ అనుభవాన్ని కూడా అందిస్తాయి.

ఈ కొత్త స్టోర్‌లు బిర్లా ఓపస్ పెయింట్స్ విస్తరణ ప్రణాళికను వేగంగా ముందుకు తీసుకువెళుతున్నాయి. ఆరింటిలో నాలుగు అత్యాధునిక, ఆటోమేటెడ్ తయారీ ప్లాంట్‌లు భారతదేశం అంతటా పూర్తిగా పనిచేస్తున్నాయి. లూథియానా, పానిపట్, చెయ్యార్ మరియు ఇప్పుడు చామరాజ్‌నగరలో ఉన్న ఈ ప్లాంట్లు సంస్థ  విస్తరణ అడుగుజాడలకు కీలకంగా ఉన్నాయి. వాస్తవానికి, ఇటీవల ప్రారంభించిన చామరాజ్‌నగరలోని ఫెసిలిటీ బిర్లా ఓపస్ పెయింట్స్‌కు దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని 860 సాలీనా మిలియన్ లీటర్లు (MLPA)కి తీసుకువెళ్లేందుకు సహాయపడుతోంది. ఇది ఇన్‌స్టాల్డ్ సామర్థ్యంతో 2వ అతిపెద్ద డెకరేటివ్ పెయింట్స్ ప్లేయర్‌గా నిలిచింది.
తెలంగాణలో ప్రారంభమైన కొత్త ఫ్రాంఛైజీ స్టోర్‌లతో, హైదరాబాద్‌లోని ఈ ఫ్రాంఛైజీ స్టోర్‌లలోని ఉత్పత్తుల పనితీరును తెలుసుకునేందుకు వినియోగదారులను బ్రాండ్ ఆహ్వానిస్తోంది. ఇక్కడ ప్రతి బ్రష్‌స్ట్రోక్ ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. నిపుణుల మార్గదర్శకత్వం, ప్రీమియం-నాణ్యత ఉత్పత్తులు మరియు వినూత్న పరిష్కారాలను ఈ స్టోర్లలో ఆస్వాదించండి.

బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్‌గేవ్ మాట్లాడుతూ, “ఆరు నెలల స్వల్ప వ్యవధిలో హైదరాబాద్‌కు నేను మూడవ సారి వచ్చాను. రాష్ట్రంలో మా రెండు కొత్త ఫ్రాంఛైజీ స్టోర్లను ప్రారంభించడం అనేది మేము తెలంగాణలో తమ ఉనికిని ఎలా కొనసాగిస్తున్నామో తెలియజేస్తోంది. నేను ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిసారీ, బిర్లా ఓపస్ పెయింట్స్ ఉత్పత్తుల నాణ్యతకు సంబంధించి వినియోగదారులు, పెయింటర్‌లు మరియు డీలర్‌ల నుంచి అధిక సానుకూల అభిప్రాయాన్ని ఆలకించేందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఇది చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ, ఇటువంటి కొత్త మైలురాళ్లను చేరుకునేందుకు మమ్మల్ని ప్రేరేపిస్తోంది. మా ప్రణాళికాబద్ధమైన 145 ఉత్పత్తులలో 80% ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉండడంతో, బిర్లా ఓపస్ పెయింట్స్ త్వరలో భారతదేశంలో రెండవ-అతిపెద్ద డీలర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుందని, అలాగే 6000 పట్టణాల్లో ఉనికిని కలిగి ఉంటుందని మేము ధీమాతో ఉన్నాము. దీనితో మేము ఎక్కువ మంది వినియోగదారులను చేరుకుంటాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.

కొత్తగా ప్రారంభించిన ఫ్రాంఛైజీ స్టోర్ వివరాలు:
1. స్టోర్ 1 – శ్రీ మహాలక్ష్మి ఏజెన్సీస్, D.No.1-64/1, రహ్మత్ గుల్షన్ కాలనీ, గచ్చిబౌలి క్రాస్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ -500032
2. స్టోర్ 2 – చౌదరి బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో, ప్లాట్ నెం. 03 & 19, NH రోడ్ దగ్గర - మేడ్చల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ - 501401
ఈ రెండు ఫ్రాంఛైజీ స్టోర్‌లు ఇప్పుడు వ్యాపారులు మరియు వినియోగదారులకు సోమవారం నుంచి శనివారం వరకు తెరిచి ఉంటాయి. ఆదివారాలు మినహా వారపు రోజులలో వారి ఆఫర్లను అన్వేషించుందకు వినియోగదారులను కంపెనీ ఆహ్వానిస్తోంది.
భారతదేశంలోని ప్రముఖ పెయింట్ బ్రాండ్‌లలో ఒకటిగా సిద్ధమైన బిర్లా ఓపస్ పెయింట్స్ ఇప్పటికే 80 నగరాల్లో ఫ్రాంఛైజీ స్టోర్‌లను ప్రారంభించగా, 150 నగరాలలో స్టోర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ఇప్పుడు రెండు కొత్త ఫ్రాంఛైజీ స్టోర్‌లు సోమవారం నుంచి శనివారం వరకు వ్యాపారులు మరియు వినియోగదారుల కోసం తెరచి ఉంటాయి. ఆదివారాలు మినహా వారం రోజులలో తమ ఆఫర్లను అన్వేషించడానికి బ్రాండ్ వారిని స్వాగతిస్తోంది.

About Birla Opus Paints: 
Birla Opus Paints, housed under Grasim Industries, Aditya Birla Group’s flagship firm, offers Decorative Painting Solutions to consumers in India. Launched in 2024, Birla Opus Paints has a complete portfolio featuring a range of superior products across categories like interiors, exteriors, waterproofing, enamel paints, wood finishes, and wallpapers. With six manufacturing plants spread across India, Birla Opus Paints is well positioned to be amongst the market leaders in the decorative paints category. The brand aims to inspire people to turn their surrounding spaces into their very own masterpiece.

More Press Releases