యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా సమర్పణలో తెరకెక్కిన సునామీ కిట్టి 'కోరా ఇంటెన్స్' ఫస్ట్ లుక్
ఇండియన్ స్క్రీన్ మీద ప్రస్తుతం యాక్షన్ చిత్రాలకు ఉన్న క్రేజ్ గురించి, సాధిస్తున్న విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి యాక్షన్ హీరోలు కన్నడ నుంచి ఎక్కువగా వస్తున్నారు. కన్నడలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ఒకరైన యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన సమర్పణలో సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రలతో ‘కోరా’ అనే చిత్రాన్ని ఒరటాశ్రీ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఎబి నందిని, ఎఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మించారు.
తాజాగా కోరా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. హై ఆక్టేన్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం రాబోతోందనిపిస్తోంది. సునామీ కిట్టిని ఆగ్రహావేశాలు ఈ లుక్‌లో కనిపిస్తున్నాయి. అతని ముఖం మీద గాయాలు, ఇంటెన్స్ లుక్‌ని చూస్తుంటే ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కోరా చిత్రం ఉండబోతోంది.
ఈ చిత్రంలో ఎం.కె.మాత, మునిరాజు, నీనాసం అశ్వత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె. గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి స్టంట్స్ కొరియోగ్రఫీ: కోరా చిన్నయ్య. జినేద్ర ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: సునామీ కిట్టి , చరిష్మా , పి.మూర్తి , M.K మాత , మునిరాజు , నినాసం అశ్వత్ తదితరులు
సాంకేతిక సిబ్బంది
సమర్పకులు: యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా
రచయిత, దర్శకుడు: ఒరాటశ్రీ
నిర్మాతలు: డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ, పి.మూర్తి
బ్యానర్లు: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్
కెమెరామెన్: సెల్వం మత్తప్పన్
సంగీత దర్శకుడు: బి ఆర్ హేమంత్ కుమార్
ఎడిటర్: కె.గిరీష్ కుమార్
విన్యాసాలు: కోరా చిన్నయ్య
మేకప్: ప్రదీప్
ఆర్ట్ డైరెక్టర్: జినేద్ర
PRO: సాయి సతీష్