మొక్క‌ల పెంప‌కంలో తెలంగాణ నెం1.. గ‌ణాంకాల‌ను వెల్ల‌డించిన కేంద్ర అట‌వీ శాఖ‌

Related image

  • అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపిన మంత్రి అల్లోల‌

  • ఇదే స్పూర్తితో ఆకుప‌చ్చ తెలంగాణ సాధ‌న దిశ‌గా ప‌ని చేయాల‌ని పిలుపు

చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్క‌ల పెంప‌కంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మొక్క‌ల పెంప‌కంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింద‌ని కేంద్ర అట‌వీ శాఖ గ‌ణాంకాల‌ను వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అట‌వీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినంద‌న‌లు తెలిపారు. మొక్క‌ల పంప‌కం, అట‌వీ పున‌రుజ్జీవ‌నం, అట‌వీ ర‌క్ష‌ణకు తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ప్రభుత్వం చేప‌డుతున్న అట‌వీ ర‌క్ష‌ణ చ‌ర్యలు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయ‌న్నారు. ఆకుప‌చ్చ తెలంగాణ సాధ‌న ల‌క్ష్యానికి చేరువ‌లో ఉన్నామ‌ని, అధికారులు, సిబ్బంది మ‌రింత క‌ష్ట‌ప‌డి ఆ దిశ‌గా ప‌ని చేయాల‌న్నారు.  రానున్న రోజుల్లో అట‌వీ పున‌రుజ్జీవ‌నంపై మ‌రింత దృష్టి పెట్ట‌నున్న‌ట్లు ఈ సంద‌ర్బంగా మంత్రి వెల్ల‌డించారు.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజున మొక్క‌లు నాటుదాం: మంత్రి అల్లోల‌

ఆకుపచ్చ తెలంగాణకై కృషి చేస్తోన్న ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌ను నాటి సంర‌క్షించాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆశయాలకు అనుగుణంగా ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మొక్క‌ను నాటి కానుక‌గా ఇద్దామ‌న్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునివ్వ‌డం ఆదర్శనీయమన్నారు.

More Press Releases