టైమ్ ఛేంజ్ అలెర్ట్! జీ తెలుగు సింగింగ్ షో సరిగమప సీజన్ 16 నవంబర్ 10 నుండి ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటలకు, తప్పక చూడండి!

Related image

హైదరాబాద్, 07 నవంబర్ 2024:  విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సింగింగ్ షో సరిగమప సీజన్ 16 - ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ ప్రత్యేక ఎపిసోడ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రారంభం నుంచీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మ్యూజికల్ రియాలిటీ షో సరిగమప సీజన్ 16 నవంబర్ 10 నుండి ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటల నుంచి 10 గంటల వరకు ప్రసారం కానుంది. 

ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ సీజన్‌కు సంగీత దిగ్గజాలు కోటి, ఎస్పీ శైలజ, కాసర్ల శ్యామ్‌తో ఈ సీజన్ ఉత్తేజకరమైన ప్రదర్శనలు, మనసును హత్తుకునే పాటలతో సంగీత ప్రియులకు మరింత వినోదం పంచబోతోంది. ప్రతి కంటెస్టెంట్ తమ ఆకట్టుకునే ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్‌గా మారుతున్నారు. ఔత్సాహిక గాయకులు తదుపరి సింగింగ్ సెన్సేషన్ టైటిల్ కోసం పోటీ పడుతుండటంతో థ్రిల్లింగ్ కాంపిటీషన్లు, మరచిపోలేని క్షణాలను అందిస్తూ ప్రతి వీకెండ్ను మరింత స్పెషల్ చేస్తోంది. 

ఆదివారం అంతులేని వినోదం అందించే ఉద్దేశంతో జీ తెలుగు సరిగమప సీజన్ 16 ప్రసార సమయాన్ని మరింత పెంచింది. శ్రోతల మనసును తాకే సంగీతంతోపాటు చక్కని వినోదం అందించే లక్ష్యంతో వస్తున్న జీ తెలుగు సరిగమప సీజన్ 16 ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటలకు, తప్పక చూడండి!

సంగీత ప్రియులకు జీ తెలుగు కానుక.. సరిగమప సీజన్ 16 ఈ ఆదివారం నుండి ప్రతి ఆదివారం రాత్రి 8:30 గంటలకు, మిస్ కాకండి!

Zee Telugu
Sa Ri Ga Ma Pa
Singing Show

More Press Releases