‘నరుడి బ్రతుకు నటన’ చిత్రానికి ఊహించని స్పందన వస్తోంది : హీరో శివ కుమార్

Related image

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం అక్టోబర్ 25న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో వచ్చిన ఈ చిత్రానికి థియేటర్లో ఇప్పుడు మంచి స్పందన వస్తోంది. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పేందుకు సోమవారం నాడు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది.

 శివ కుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ.. ‘మా సినిమాకు మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంత బాగా రివ్యూలు వస్తాయని, ఆడియెన్స్ ఇంత బాగా ఆదరిస్తారని మేం కూడా ఊహించలేదు. ఇంకా చూడని వాళ్లంతా చూసి మా సినిమాను సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

 రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్పగా ఆదరిస్తున్న ఆడియెన్స్, మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

 నిర్మాత సింధు రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమాకు చాలా మంచి రివ్యూలు వచ్చాయి. ఆడియెన్స్ సైతం మా సినిమాను ప్రశంసిస్తున్నారు. మాలాంటి కొత్త వారిని ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మరిన్ని మంచి చిత్రాలు చేస్తాం. మా సినిమాను ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కి వెళ్లి చూడండి’ అని అన్నారు.

Narudi Brathuku Natana
Shiva Kumar Ramachandravaru
Nithin Prasanna

More Press Releases