క్లీన్ & గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం నగర పరిశుభ్రంలో భాగంగా ఖమ్మం మణిహారం అయిన లకారం ట్యాంక్ బండ్ పై NCC & మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన CLEAN & GREEN కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ప్రారంభించారు. అనంతరం తడి, పొడి చెత్త సేకరణ కోసం ఐదు వ్యాన్ లు, కాంపాక్టర్ ను ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ తెలంగాణ, క్లీన్ అండ్ గ్రీన్ ఖమ్మంగా తీర్చిదిద్దటంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి IAS, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, డివిజన్ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, టూరిజంశాఖ అధికారులు పాల్గొన్నారు.

Puvvada Ajay Kumar
TRS
CLEAN & GREEN
Hyderabad
Khammam District
Telangana

More Press Releases