పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని పవర్ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!

Related image

హైదరాబాద్, 25 అక్టోబర్: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించడంలో ఎప్పుడూ ముందుండే జీ తెలుగు ఈ వారం మరో కొత్త సినిమాతో వచ్చేస్తోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా అందిస్తోంది. అద్భుతమైన కథ, కథనంతోపాటు పూరీ జగన్నాథ్ డైరెక్షన్, రామ్ నటవిశ్వరూపంతో అదరగొట్టిన డబుల్ ఇస్మార్ట్, ఈ ఆదివారం(అక్టోబర్ 27న) సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ అంతర్జాతీయ మాఫియా డాన్ బిగ్ బుల్ (సంజయ్ దత్) చుట్టూ తిరుగుతుంది. అతను గ్లియోమా నిర్ధారణ అయిన తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి ఆరాటపడతాడు. అతని జ్ఞాపకశక్తిని మరొకరి మెదడుకు బదిలీ చేయడం వల్ల అతను అమరుడవుతాడని ఒక శాస్త్రవేత్త సూచించడంతో అందుకు సరిపోయే వ్యక్తికోసం అన్వేషణ మొదలవుతుంది. ఆ అన్వేషణలో హైదరాబాద్ లోని శంకర్ (రామ్ పోతినేని) సరైన వ్యక్తిగా గుర్తించడంతో బిగ్ బుల్ మెమరీ ట్రాన్స్ ఫర్ జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయం తెలియాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే డబుల్ ఇస్మార్ట్ సినమా చూడాల్సిందే.

రామ్ పోతినేని, కావ్య థాపర్ జంటగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్, గెటప్ శ్రీను, అలీ, షాయాజీ షిండే, ఝాన్సీ  వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను జీ తెలుగు వేదికగా ఈ ఆదివారం మీరూ తప్పకుండా చూడండి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్-రామ్ పోతినేని యాక్షన్ మేళవింపుతో మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన డబుల్ ఇస్మార్ట్, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

Double Ismart
Ram Pothineni
Kavya Thapar
Puri Jagannadh
Zee Telugu

More Press Releases