కిరణ్ అబ్బవరం "క" సినిమా ట్రైలర్ రిలీజ్

Related image

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క" ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి  నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

"క" సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.... చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిలో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఆ ఊరు భౌగోళికంగా ఎంతో ప్రత్యేకం. అక్కడ సత్యభామ అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనే అంశాలు ఆసక్తిని కలిగించాయి. ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా..' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్ రావడం సర్ ప్రైజ్ ట్విస్ట్ ఇచ్చింది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా "క" సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.

Ka movie
Ka trailer
Kiran abbavaram

More Press Releases