మెకానిక్‌ రాకీని రెండో సారి కూడా చూస్తారు: విశ్వక్‌సేన్‌

Related image

యువ కథానాయకుడు విశ్వక్‌సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మెకానిక్‌ రాకీ'. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు.రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు 'మెకానిక్ రాకీ' ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. నవంబరు 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ట్రైలర్‌ ఎలా వుందంటే:  రాకీ చదువులో ఫెయిల్ అయిన తర్వాత, తన తండ్రి మెకానిక్ షాప్ ని టేకోవర్ చేసుకొని, లేడిస్ కోసం డ్రైవింగ్ స్కూల్‌ను ప్రారంభిస్తాడు. హీరోయిన్స్ పాత్రలు పోషించిన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లని ఫ్లర్ట్ చేస్తాడు. పవర్ ఫుల్ మ్యాన్ సునీల్ తో తలపడటం క్యురియాసిటీని పెంచింది.  

ట్రైలర్ లో యాక్షన్, హ్యుమర్, రొమాన్స్, మాస్ అన్నీ ఎలిమెంట్స్  వున్నాయి. విశ్వక్ సేన్  పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌ కనిపించాయి. 
మీనాక్షి చౌదరి క్లాసిక్, ట్రెడిషినల్ గా పాత్రలో మెరిసింది. శ్రద్ధా శ్రీనాథ్ మోడరన్ అమ్మాయి పాత్రను పోషించింది. నరేష్, వైవా హర్ష కామెడీ వినోదాన్ని పంచారు. సునీల్ మెయిన్ విలన్ గా కనిపించాడు. 

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితిలో ఏడాదికి మూడు సినిమాలు రిలీజ్ చేయడం చాలా తక్కువ మందికి కుదురుతుంది. ఇంతదూరం వచ్చానంటే ఈ జర్నీలో ఇద్దరే వున్నారు. ఒకటి నేను, రెండు మీరు. నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది మీ అభిమానమే. నవంబర్ 22 సినిమా రిలీజ్. సినిమా మొన్న చూసుకున్న . చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను. నవంబర్ 21, సాయంత్రం పెయిడ్ ప్రిమియర్స్ వేస్తాం.  సినిమా ఎడ్జ్ అఫ్ ది సీట్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. అంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నా. 

రెండోసారి సినిమా చూసే రేంజ్ లో వుంది.సెకండ్ హాఫ్ థియేటర్స్ అన్నీ అడిటోరియమ్ లా మారిపోతాయి. ఇది ట్రైలర్ 1.0. రిలీజ్ దగ్గరలో మరో ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఆ ట్రైలర్ కి ట్రైలర్ అనుకోండి. నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్ గా నిలిచారు. ఈ సినిమాలో ఆయనకి చాలా డబ్బులు రావాలి. శ్రద్ధ వండర్ ఫుల్ కో స్టార్. మీనాక్షి కి థాంక్ యూ సో మచ్. మా కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేస్తారు. డైరెక్టర్ రవి థాంక్ యూ సో మచ్. జేమ్స్ బిజోయ్ బీజీఎం ఇరగదీశాడు. టీంలో పని చేసిన అందరికీ థాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ లవ్ యూ సో మచ్. నవంబర్ 22న థియేటర్స్ లో కలుద్దాం' అన్నారు.     

More Press Releases