పొట్టేల్‌ దొరికిందా? ఇంట్రెస్టింగ్‌ పొట్టేల్‌ ట్రైలర్‌!

Related image

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ముఖ్యతారలుగా రూపొందిన చిత్రం పొట్టేల్‌. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  అక్టోబర్‌ 25న చిత్రం విడుదల కానుంది. శుక్రవారం  ఈ చిత్రం ట్రైలర్‌ను కథానాయిక సంయుక్త మీనన్‌ విడుదల చేశారు. 

ట్రైలర్‌ను గమనిస్తే...తెలంగాణ సరిహద్దు దగ్గర హీరో, అతని కూతురు,  టీచర్ వచ్చినప్పుడు అతని కాళ్ళపై పడి తనకు చదువు చెప్పమని వేడుకునే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమౌతుంది. ఇంతలో బలివ్వడానికి సిద్ధం చేసిన పొట్టేల్ ని ఎవరో దొంగలిస్తారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, పటేల్ అజయ్ ఆదేశాలతో, హీరో కుటుంబంపై దాడి చేస్తారు. పటేల్, అమ్మాయిని బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. బాధలో ఉన్న హీరో జలపాతం వద్ద నిలబడిన ప్రాణ త్యాగానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, హార్ట్ టచ్చింగ్ ఎమోషన్స్, విద్య యొక్క ప్రాముఖ్యత సినిమా యొక్క ప్రధాన కథాంశంగా ట్రైలర్ రివిల్ చేస్తోంది. 

దర్శకుడు సాహిత్ మోత్ఖూరి ప్రతి పాత్రను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యువ చంద్ర కృష్ణ తన కూతురి చదువు కోసం ఆరాటపడే  తండ్రిగా కనిపించగా, అనన్య నాగళ్ల తన భార్య క్యారెక్టర్ లో ఇన్నోసెంట్, నేచురల్ గా కనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అజయ్ ఇంటెన్స్ రోల్ లో అదరగొట్టడంతో పాటు ఫీమేల్ ఎప్పిరియన్స్ లో సర్ ప్రైజ్ చేశారు. మోనిష్ భూపతి రాజు కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. శేఖర్ చంద్ర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డ్రామాని ఎలివేట్ చేసింది, పెంచల్ దాస్ వాయిస్ ఎమోషన్స్ మరింతగా యాడ్ చేసింది . ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ట్రైలర్ మరింత అంచనాలను పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ..  ఐ లవ్ ద ట్రైలర్. మంచి కంటెంట్ ఎవరు చేసినా నాకు చాలా ఇష్టం. డైరెక్టర్ సాహిత్ ఒక స్టోరీ మీద ఫోర్ ఇయర్స్ వర్క్ చేయడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన క్వాలిటీలో స్క్రీన్ మీద తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి రైటింగ్, డైరెక్షన్ వుంటనే ఇంత అద్భుతమైన సినిమా తెరపైకి వస్తుంది .  ఈ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు ఒక రియల్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనిపించింది. చాలా అథెంటిక్ గా ఉంది.  ఇంత మంచి ఎఫర్ట్ తో ఈ సినిమాని తీసిన యూనిట్ అందరికీ అభినందనలు.

హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. ట్రైలర్ లో చూసింది 1% మాత్రమే, సినిమా చూసిన ఆడియన్ గా చెప్తున్నాను. ఈ సినిమా ఆడియన్స్ తో ఒక వన్ వీక్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది.  డైరెక్టర్ సాహిత్ ఈ సినిమాని చాలా అద్భుతమైన లేయర్స్ గా రాశాడు. ప్రతి లేయర్ ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటాం. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు గ్రేట్ స్టోరీ ఉంది. అక్టోబర్ 25న రిలీజ్ అవుతుంది. మీరందరూ సినిమాను చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు 


డైరెక్టర్ సాహిత్ మోత్ఖురి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేనేం చెప్పదలుచుకున్నానో ట్రైలర్ లో మీ అందరికీ అర్థమై ఉంటుంది. సంయుక్త గారు ట్రైలర్ లాంచ్ ఈ ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్స్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. అజయ్ అన్నతో పాటు అందరికీ థాంక్యూ సో మచ్' అన్నారు. 

నిర్మాత నిశాంక్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియాకి థాంక్ యు సో మచ్. టీజర్ ట్రైలర్ అందరూ చూశారు. సినిమా ఎంత బాగుందో రేపొద్దున మీరే చెప్తారు. ఈ సినిమాని ఆడియన్స్ చేతిలో పెడుతున్నాం. మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.  సంయుక్త లక్కీ హ్యాండ్. తను ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ సాహిత్ అద్భుతంగా తీశాడు. కాస్ట్ అండ్ క్రూ గురించి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడతాను. థాంక్యూ సో మచ్' అన్నారు. 

నిర్మాత సురేష్  మాట్లాడుతూ..  ఈ సినిమా ఎనిమిది తొమ్మిది సార్లు చూసాను. నేను సినిమా లవర్ ని. ఒక సినిమా లవర్ గా తీసిన సినిమా ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్. సినిమా చూశాక సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాం. థాంక్యూ' అన్నారు



More Press Releases