ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం ట్రైలర్‌ విడుదల

Related image

ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఉగ్రావతారం', గురుమూర్తి దర్శకుడు. ఉపేంద్ర సమర్పణలో ఎస్‌జీ సతీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబరు 1న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ ' ‘నాకు హైద్రాబాద్‌తో ఎంతో అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని ఫస్ట్ టైం ఇక్కడే కలిశాను. హైద్రాబాద్ నాకు చాలా లక్కీ సిటీ. నా కెరిర్‌లో ఇదే ఫస్ట్ యాక్షన్ ఫిల్మ్. గురుమూర్తి గారి వల్లే ఈ మూవీని చేశాను. నేను ఈ పాత్రకు సెట్ అవుతాను అని ఆయనే నమ్మారు. కెమెరామెన్ నందకుమార్ అందరినీ బాగా చూపించారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. రాజు గారు తెలుగులో మంచి పాటలు, మాటలు ఇచ్చారు. కృష్ణ బస్రూర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నవంబర్ 1న మా చిత్రం రాబోతోంది.నా మొదటి పాన్ ఇండియన్ మూవీని అందరూ చూడండి’ అని అన్నారు.


దర్శకుడు గురుమూర్తి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరిగే అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని మీడియా ప్రశ్నించి ఎదురించగలదు. మా ఈ చిత్రాన్ని అటువంటి సమస్యల మీదే తీశాను. మంచి సందేశాత్మాక చిత్రంగా ఉంటుంది. ప్రియాంక మేడం కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. నటరాజ్ అద్భుతంగా నటించాడు. నవంబర్ 1న రానున్న మా చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

 నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. ‘కలకత్తా కాళి గురించి అందరికీ తెలిసిందే. మన ప్రియాంక గారు కలకత్తా బిడ్డ. కర్తవ్యంలో విజయశాంతి గారిని చూసి ఎలా అనుకున్నారో.. ఈ మూవీ తరువాత ప్రియాంక గారిని అలా అనుకుంటారు. ఈ మూవీ తరువాత ప్రతీ ఇంట్లోకి ప్రియాంక గారు వెళ్తారు. మనమంతా కలిసి ఆమెను సపోర్ట్ చేద్దాం. ఈ చిత్రంలో నా కొడుకు నటించాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. గురుమూర్తి చాలా డెడికేటెడ్ డైరెక్టర్. నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

సుమన్, నటరాజ్ పేరి, అజయ్, పవిత్రా లోకేష్, సాయి ధీనా, సుధి కాక్రోచ్, లక్ష్య శెట్టి వంటి వారు ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

More Press Releases