రహస్యం ఇదం జగత్‌' నుంచి ఈ జగమే విధిగా లిరికల్‌ సాంగ్‌

Related image

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌.  మన పురాణాలు, ఇతిహాసాల గురించి... శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రమిదని  రహస్యం ఇదం జగత్‌ టీమ్‌ చెబుతుంది. నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు.  తాజాగా ఈ చిత్రం నుంచి ఈ జగమే విధిగా అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. గ్యాని సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను హారిక నారాయణ్‌ అండ్‌ గ్యానీ ఆలపించారు. రమేష్‌ కుమార్‌ వక్కచర్ల సాహిత్యం అందించారు. 

నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్‌ ఈ చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తిని పెంచింది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి.  తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు. 


More Press Releases