సినిమాపై ఆసక్తి పెంచుతున్న ‘నరుడి బ్రతుకు నటన' ట్రైలర్‌

Related image

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన. శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ్ ఇతర ప్రముఖ తారాగణంతో రాబోతోన్న ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. గురువారం ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు.
 
నిహారిక కొణిదెల ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసి.. యూనిట్ కి అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ ట్రైలర్.. శివ కుమార్ నటుడు అవ్వాలని ఆడిషన్స్ ఇస్తూ ఫెయిల్ అయ్యే సీన్ తో ఓపెన్ అవుతోంది. అందరూ అతడ్ని నిరుత్సాహ పరుస్తూనే ఉంటారు. జీవితం అంటే ఏంటో తెలిస్తేనే.. నటన తెలుస్తుందని చెప్పడంతో.. ఓ తెలియని ఊరికి వెళ్తాడు. అలా కథ హైద్రాబాద్ నుంచి కేరళకు షిఫ్ట్ అవుతుంది. ట్రైలర్ లో చూపించిన కేరళ అందాలు, సినిమాలోని ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. హాస్యం, ప్రేమ, ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తీశారని ట్రైలర్ చెబుతోంది. అక్టోబర్‌ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వివా రాఘవ్, దయానంద్ రెడ్డి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: ఫహద్ అబ్దుల్ మజీద్


Narudi Brathuku Natana

More Press Releases