వినోదాత్మకంగా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్"

Related image

రాహుల్‌ విజయ్‌, నేహా పాండే జంటగా నటిస్తున్న నూతన చిత్రం ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్. అశోక్ రెడ్డి కడదూరి దర్శకుడు ఇంతకు ముందు "డియర్ మేఘ", "భాగ్ సాలే" వంటి చిత్రాల్ని నిర్మించిన నిర్మాణ సంస్థ వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్. అర్జున్ దాస్యన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తమ ప్రొడక్షన్ నెం.4గా "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్" సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను కథానాయకుడు రానా దగ్గుబాటి లాంఛ్ చేశారు.

 టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా వుందని, సినిమా విజయవంతం కోవాలని విషెస్‌ అందజేశారు రానా. రాహుల్ విజయ్, నేహా పాండే, అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డివోపీ: కార్తీక్‌ కొప్పెర, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నిర్మాత: అర్జున్‌ దాస్యన్‌


Khel Khatam Darwajaa Bandh

More Press Releases