నిఖిల్‌-సుధీర్‌ వర్మల యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’..

Related image

స్వామిరారా చిత్రంతో హీరో నిఖిల్‌కు మంచి కమర్షియల్ సక్సెస్‌ అందించిన దర్శకుడు సుధీర్‌ వర్మ మరోసారి నిఖిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే టైటిల్‌ని నిర్ణయించారు. స్వామిరారా, కేశవ తరువాత ఈ కాంబోలో రాబోతున్న మరో మూవీ ఇది. సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖల్‌ పాత్ర కూడా వైవిధ్యంగా వుంటుందని చెబుతున్నారు మేకర్స్‌. 

రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. దీపావళికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హ‌ర్ష చెముడు ముఖ్య పాత్ర‌లో నటిస్తున్న ఈ చిత్రానికి యోగేష్ సుధాక‌ర్‌, సునీల్ షా, రాజా సుబ్ర‌మ‌ణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూస‌ర్స్‌. బాపినీడు.బి ఈ చిత్రానికి స‌మ‌ర్పణ‌. సింగ‌ర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని..స‌న్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. 

More Press Releases