టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో 'రివైండ్‌'

Related image

సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రివైండ్‌'. కళ్యాణ్‌ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌.  ఈ నెల 18న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత కళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ  టైం ట్రావెల్ మీద తీసిన లవ్, సైంటిఫిక్‌ జోనర్ మూవీ ఇది. టైం ట్రావెల్ మీద వచ్చే సినిమాలు ఎప్పుడు సక్సెస్ అవుతాయి. ఈ మూవీ స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చింది. మా ఈ టైం ట్రావెల్ మీద తీసిన రివైండ్ మూవీ కూడా ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో సాయి రోనక్ మాట్లాడుతూ : మాకున్న బడ్జెట్, లైన్ అప్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి కంటెంట్ ని తయారు చేశాం. డైరెక్టర్ కళ్యాణ్ గారు ఎన్.ఆర్.ఐ అయ్యుండి ఇక్కడికి వచ్చి డబ్బు పెట్టి మంచి కథతో సినిమాను తీయడం నిజంగా గర్వించదగ్గ విషయం. తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు. ఈనెల 18న ఈ సినిమాని విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులు అందరూ సినిమా చూసి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


More Press Releases