జేబీఎస్‌ - ఎంజీబీఎస్‌ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

Related image

జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోరైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ ప్రభుత్వ, మెట్రో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

KCR
Hyderabad Metro
Hyderabad
JBS
MGBS
Telangana

More Press Releases