గోపీచంద్‌ 'విశ్వం' నుంచి మొండి తల్లి పిల్ల నువ్వు సాంగ్ రిలీజ్

Related image

గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కలయికలో  వస్తున్న మూవీ 'విశ్వం'. కావ్య థాపర్ హీరోయిన్‌. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.ఇటీవల ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌గా  'మొరాకో మగువా' అనే పాట విడుదలైంది. ఈ రోజు మేకర్స్ సెకెండ్ సింగిల్ 'మొండి తల్లి పిల్ల నువ్వు' సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని ప్రజెంట్ చేసే పాటగా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు. 

అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునే విధంగా వున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.  మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె.దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

Viswam movie
Hero Gopi chand
Viswam movie song

More Press Releases