సుధీర్ బాబు సూపర్‌ నేచురల్‌ థ్రిల్ల‌ర్‌ ‘జటాధర’

Related image

సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా రూపొందుతోన్న సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ ‘జటాధర’. ఈ చిత్రం 2025 శివ‌రాత్రి విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ విడుదలైంది. పౌరాణిక‌, ఫాంట‌సీ, డ్రామా అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని విడుద‌లైన పోస్ట‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు స‌రికొత్త లుక్‌తో, శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఈ సినిమా గురించి  సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘‘జ‌టాధ‌ర‌’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణ చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఇంత గొప్ప స్పంద‌న రావ‌డంతో సంతోష‌మేసింది. ఆ సంతోషాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. ఈ సినిమాలోకి అడుగు పెట్ట‌టం అనేది ఓ స‌రికొత్త ప్ర‌పంచాన్ని నాకు ప‌రిచ‌యం చేసింది. 

నాకు ఇది ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని అనుభ‌వం. శాస్త్రీయ‌త‌, పౌరాణిక అంశాల క‌ల‌యిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోన‌ర్స్‌కు చెందిన ప్ర‌పంచాల‌ను రేపు ఆడియెన్స్ వెండితెర‌పై చూస్తున్నప్పుడు ఓ స‌రికొత్త సినిమా అనుభూతిని పొందుతారు. ఓ సినిమా స‌క్సెస్‌కైనా కార‌ణం బ‌ల‌మైన స్క్రిప్ట్‌. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి సినిమాగా ప్రాణం పోసుకుంటుంది. మా సినిమా విష‌యంలో అదే జ‌రుగుతుంది. ప్రేర‌ణ అరోరాగారు బెస్ట్ టీమ్‌తో జ‌టాధ‌ర సినిమాను ఆవిష్క‌రిస్తున్నారు. ఆమెతో క‌లిసి ట్రావెల్ చేయ‌టం గొప్ప అనుభూతి. విజువ‌ల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ఓ అద్భుత‌మైన సినిమాను ఆమె తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్ట‌ర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. 

ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండ‌బోతున్నాయి. వాటి గురించి తెలియ‌జేయ‌టానికి, ప్రేక్ష‌కులు ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాల‌ని నేను ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ప్రేర‌ణ అరోరా, శివివ‌న్ నారంగ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సినిమాలో హీరోయిన్‌గా ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌టించ‌నుంది. అలాగే ప్ర‌తినాయ‌కి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ న‌టించనుంది. ఆ వివ‌రాల‌ను మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం జ‌టాధ‌ర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది.
.

More Press Releases