మత్తు వదలరా-2 పది రోజుల్లో 30 కోట్లు కలెక్ట్‌ చేసింది: నిర్మాతలు

Related image

శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం  'మత్తువదలరా2'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు.మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన మైత్రీ రవిశంకర్‌ మాట్లాడుతూ  చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా మా అంచనాలను దాటి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా వసూలు చేసింది.  నార్త్ అమెరికాలో వన్ మిలియన్ మార్క్ దాటింది. ఓవర్సీస్ లోనే 10 కోట్లు కలెక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కలుపుకొని దాదాపు 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. టోటల్ గా ఇవాల్టికి 30 కోట్లకు పైగా  గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాకి ఇంకా వసూలు పెరుగుతాయని  నమ్ముతున్నాము. 

దసరా సెలవుల్లో కూడా ఈ రన్ కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాము. టీం అంతా చాలా ఆనందంగా ఉన్నాం. ఇదే ఇదే ఉత్సాహంతో మత్తు వదలరా-3 కూడా చేస్తాం' అన్నారు. సినిమా విడుదలై పది రోజులు పూర్తవుతున్న ఇంత మంచి వసూళ్లు సాధిస్తూ, హౌస్‌ఫుల్స్‌తో థియేటర్లు కనిపించడం సంతోషంగా వుందని నిర్మాత చెర్రీ తెలిపారు. ఈ సమావేశంలో హీరో శ్రీ సింహ, హీరోయిన్‌ ఫారియా అబ్దుల్లా, దర్శకుడు రితేష్‌ రానా తదితరులు వున్నారు.

Mathuvadalara2
Mathuvadalara2 review
Mathuvadalara2 collections

More Press Releases