దీపావళికి డివోష‌న‌ల్ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ ష‌ణుఖ్మ‌!

Related image

ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'షణ్ముఖ'. డివోషనల్‌ థ్రిల్లర్‌ రూపొందుతున్న ఈ చిత్రానికి షణ్ముగ సాప్పని దర్శకుడు. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, ఈ  పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌ ఈ చిత్రంలో ఇన్వస్టిగేషన్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తాడు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మ‌ట్లాడుతూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ దీపావళి సీజన్‌లో ఫ్యామిలీ చూడదగ్గ డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది.  కేజీఎఫ్‌, స‌లార్ చిత్రాల‌కు త‌న సంగీతంతో ప్రాణం పోసిన ర‌వి బ‌సూర్ ఈ చిత్రానికి స్ట‌నింగ్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. ప్ర‌స్తుతం అత్యున్న‌త సాంకేతిక నిపుణుల‌తో నిర్మాణనంత‌ర ప‌నులు మొద‌లుకానున్నాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని, ఓ వండ‌ర్‌ఫుల్ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌ప్ప‌కుండా ఈ చిత్రం ఆది కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుంది' అన్నారు.

More Press Releases