ఉత్కంఠ రేపుతున్న 'వెనమ్' ట్రైలర్‌

Related image

సోనీ పిక్చ‌ర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్, మార్వెల్ వారు సంయుక్తంగా రూపొందించిన చిత్రం వెన‌మ్. ఈ మూవీ సిరీస్ లో మూడ‌వ భాగం వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఈ అక్టోబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన వెనమ్ మూవీ సిరీస్ లో మొదటి, రెండు భాగాలు వ‌ర‌ల్డ్ వైడ్ గా మూవీ ల‌వ‌ర్స్ ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ నేప‌థ్యంలో రాబోతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డాయి. ఆ అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్లుగానే ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. 

తాజాగా విడుద‌లైన వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైన‌ల్ ట్రైల‌ర్ కూడా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌ముఖ హాలీవుడ్ టామ్ హార్డీ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ సినిమా సిరీస్ తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్ష‌న్ వంటి సినిమాల్లో న‌టించి టామ్ హార్డీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. టామ్ హార్డీ న‌ట‌న‌తో పాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ స‌న్నివేశాలు వెన‌మ్ - ది లాస్ట్ డాన్స్ లో హైలైట్ గా నిల‌వబోతున్నాయి. సోనీ పిక్చ‌ర్స్ ఇండియా ప్రైవైట్ లిమిటెడ్ వారు ఎక్స్ క్లూసీవ్ గా ఇండియాలో ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాషల్లో భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. వెనమ్ - ది లాస్ట్ డాన్స్ 3డి తో పాటు ఐమాక్స్ 3డి వెర్ష‌న్ లో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నుంది

More Press Releases