గాయనీగాయకులకు సువర్ణావకాశం.. జీ తెలుగు సరిగమప సీజన్ 16: ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్ ఆడిషన్స్.. మన హైదరాబాద్‌లో

Related image

హైదరాబాద్, 20 ఆగస్ట్ 2024: తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు. ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో వినోదం అందించడంతోపాటు ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సరిగమప నిర్వహించిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది. విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్‌ 16‌- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో విజయవంతంగా నిర్వహించిన సరిగమప సీజన్ 16 ఆడిషన్స్కి ఎనలేని స్పందన లభించింది.

జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ ఆదివారం మన హైదరాబాద్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది. 15-30 సంవత్సరాల వయస్సుగల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. 

సరిగమప సీజన్ 16 ఆడిషన్స్ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. హైదరాబాద్లోని హిందూ మహిళా జూనియర్ కళాశాల, హిందూ పబ్లిక్ స్కూల్ దగ్గర, గోకుల్ థియేటర్ ఎదురుగా, సనత్ నగర్లో ఆడిషన్స్ జరగనున్నాయి. వివరాల కోసం 9154670067 నెంబర్పై సంప్రదించవచ్చు. ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్ని మిస్ కావద్దు!
అంతేకాదు ఔత్సాహికులు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. పాట పాడిన తమ వీడియోలను 9154670067 నెంబర్కి వాట్సాప్ లేదా ztsaregamapa@zee.com ఇమెయిల్ ద్వారా పంపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం జీ తెలుగు ‘సరిగమప సీజన్ 16 – ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ కోసం మీరూ పోటీలో పాల్గొనండి!

మీలోని ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని వేదిక.. జీ తెలుగు సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్.. ఆడిషన్స్లో వెంటనే పాల్గొనండి!

Zee Telugu
Zee Telugu Sarigamapa
Hyderabad

More Press Releases