చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించిన మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Related image

  • మేడారం జాత‌ర‌లో వసతులను ప‌రిశీలించిన మంత్రి

  • వసతులపై భక్తులను ఆరా

  • భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాము

  • మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

మేడారం, ఫిబ్ర‌వ‌రి 6 : గిరిజ‌నుల కుంభ‌మేళా మేడారం మ‌హా జాత‌ర రెండ‌వ రోజు కొన‌సాగుతోంది. జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌తో మేడారం జ‌న‌సంద్రంగా మారింది. మంత్రులు, అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్ల‌ను ప‌ర్యవేక్షిస్తున్నారు. గురువారం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి చిల‌క‌ల గుట్ట‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. జాత‌ర‌లో ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లిని ఇవాళ సాయంత్రం గద్దె పైకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. చిల‌క‌ల గుట్ట మీద నుంచి స‌మ్మ‌క్క‌ను గ‌ద్దెపైకి తీసుకువ‌చ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు.

అంత‌కు ముందు మేడారం జాత‌ర‌లో భ‌క్తుల‌కు క‌ల్పించిన వ‌స‌తుల‌ను పరిశీలించారు. జంప‌న్న వాగు వ‌ద్ద భ‌క్తుల‌తో మాట్లాడారు. ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన వసతులు కల్పించామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది కంటే ఈసారి క్యూ లైన్ల‌ను పెంచామ‌న్నారు. మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా గుర్తించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూనే ఉన్నామ‌ని.. అయినా కేంద్రం నుంచి స‌రియైన స్పంద‌న లేద‌న్నారు. ఇక‌నైనా దీన్నిజాతీయ పండుగ‌గా ప్ర‌క‌టించాల‌ని కోరారు. 

More Press Releases