ఓటీటీలో ఆకట్టుకుంటోన్న అజయ్ ఘోష్, చాందినీ చౌదరిల ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

Related image

అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రముఖ పాత్రల్లో నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రానికి థియేటర్లో మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. బరువెక్కిన గుండెతో థియేటర్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించి శివ పాలడుగు రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఓటీటీ సంస్థల్లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా అన్ని అంశాలతో, మంచి సందేశంతో కూడిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. థియేటర్లో వచ్చినట్టుగానే ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమాను థియేటర్లలో చూడని వారంతా ఇప్పుడు చూస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మంచి సబ్జెక్ట్‌తో సినిమా తీసి, కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినందుకు డైరెక్టర్‌ను అభినందిస్తున్నారు. టైటిల్ రోల్‌లో కనిపించిన అజయ్ ఘోష్  సహజమైన నటనను కూడా ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. ఎప్పటిలానే చాందినీ చౌదరి తన నటనతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు.

ఆమని, అమిత్ శర్మ, భాను చందర్ మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీనివాస్ బెజుగం సినిమాటోగ్రఫీ, పవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇతర ప్రధాన ఆకర్షణలు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు.

Ajay Ghosh
Music Shop Murthy

More Press Releases