'ఎఫ్ఏఓ' డైరెక్టర్ జనరల్ తో తెలంగాణ విత్తన సంస్థల డైరెక్టర్ ప్రత్యేక సమావేశం!

Related image

ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ఆహార & వ్యవసాయ సంస్థ (FAO), డైరెక్టర్ జనరల్ డా. క్యూ డొంగ్యూతో తెలంగాణ విత్తన సంస్థల డైరెక్టర్ డా.కేశవులు ప్రత్యేక సమావేశం 

  • ఇటలిలోని రోమ్ నగరంలో ఫిబ్రవరి 5న ఐక్య రాజ్య సమితి, ఆహార, వ్యవసాయ సంస్థ (FAO), డైరెక్టర్ జనరల్ డా. క్యూ డొంగ్యూతో తెలంగాణ సీడ్స్, మేనేజింగ్ డైరెక్టర్, ISTA వైస్ ప్రేసెడెంట్ డా. కేశవులు సమావేశం

  • తెలంగాణ విత్తన పరశ్రమ సామర్థ్యం, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి ప్రత్యేకంగా తయారు చేసిన బ్రోచర్ ని FAO, డైరెక్టర్ జనరల్ కి అందించిన డా. కేశవులు

  • తెలంగాణ విత్తన పరిశ్రమ, విత్తన రంగ అభివృద్ది, రాస్త్రాన్ని అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తీర్చి దిద్దాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను, విత్తన పరిశ్రమ సామర్థ్యాన్ని, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులను FAO డైరెక్టర్ జనరల్ కు వివరించిన తెలంగాణ సీడ్స్, డైరెక్టర్ డా. కేశవులు

  • తెలంగాణలో 1500 గ్రామాలలో, 3 లక్షల మంది రైతులు, దాదాపు 7 లక్షల ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టి, ఇండియాలో వివిధ రాష్త్రాలకు కావలిసీన 60% విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా 20 దేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి చేసి, తెలంగాణాలో 400 ప్రభుత్వ మరియు ప్రైవేట్ విత్తన కంపెనీలు దాదాపు 5000 కోట్ల పైనే ఈ ఒక్క ప్రాంతం  విత్తన వ్యాపారం జరుగుతుంది-డా. కేశవులు 

  • తెలంగాణ విత్తన పరిశ్రమ సామార్థ్యాన్ని చూసి ఆక్షర్యపోయిన FAO డైరెక్టర్ జనరల్, విత్తనోత్పత్తి ద్వారా రైతులు అధిక లాభాలు పొందటమే కాకుండా పరోక్షంగా వ్యవసాయంలో అధిక దిగుబదులు సాదించడానికి నాణ్యమైన విత్తనం అందించి సాదారణ రైతాంగానికి సహాయ పడుతున్నారు-FAO, DG, క్యూ డొంగ్యూ

  • మారుతున్న ఈ ప్రపంచంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తి జరగాలంటే నాణ్యమైన విత్తనం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక నాణ్యమైన విత్తనం ప్రపంచాన్ని మార్చేస్తుంది- FAO, DG, క్యూ డొంగ్యూ

  • పటిష్టమైన విత్తన విధానాలు, పద్దతులు ఉన్నపుడే ఆకలితో అలమటిస్తున్న ప్రపంచ దేశాలలో ఆహార కొరత తీరుతుంది- FAO, DG, క్యూ డొంగ్యూ

ఫిబ్రవరి 5వ తేదీ ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఉన్నFAO ప్రపంచ ప్రదాన కార్యలయంలో FAO డైరెక్టర్ జనరల్, డా. క్యూ డొంగ్యూతో తెలంగాణ విత్తన సంస్థల, డైరెక్టర్, ISTA వైస్ ప్రెసిడెంట్ డా. కేశవులు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణ విత్తన పరిశ్రమ, తెలంగాణ విత్తన రంగ అభివృద్ది, అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తీర్చి దిద్దాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను, తెలంగాణ విత్తన పరిశ్రమ, తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాల గురించి తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ డా. కేశవులు వివరించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో 1500 గ్రామాలలో, 3 లక్షల మంది రైతులు, దాదాపు 7 లక్షల ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టి ఇండియాలో 15 రాష్ట్రాలకు కావలిసీన 60% విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా 20 దేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

FAO, డైరెక్టర్ జనరల్ తో జరిగిన సమావేశం సంధర్భంగా చర్చించిన అంశాలు:

  • సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలలో ఒకే రకమైన విత్తన నియమాలు, నిభంధనలు పాటించడం: సౌత్ ఈస్ట్ ఆసియాలో కొన్ని దేశాలలో విత్తన ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని, ఇందుకుగాను ఆయా దేశాలలో ఒకే రకమైన విత్తన నియమాలు, పద్దతులు ఉండేలా చేయడం వలన విత్తన పరిశ్రమ మరింత అభివృద్ది చెంది, వితన రైతులకు మంచి లాభం చేకూరే అవకాశం ఉంటుందని, దీనికి FAO సహకారంతో ప్రాంతీయ సమావేశాలు కూడా నిర్వహిస్తామని, అంతేకాకుండా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలలో ఒకే రకమైన విత్తన నియమాలు ఉండడానికి ఇండియా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లీడ్ తీసుకోవాలని FAO అధికారులు సూచించారు.

  • విత్తనాలపై ఇండో-ఆఫ్రికన్ ప్లాట్ ఫామ్: ఇండియా, ఆఫ్రికా దేశాలలో ఒకే రకమైన వాతావరణం, పంటల సాగు ఉండటం వలన ఇండియా, ఆఫ్రికా దేశాల మద్య చిన్న మద్య తరహా విత్తన పరిశ్రమలను సమన్వయ పరిచి పరస్పర విత్తన ఎగుమతులను ప్రోస్థహించవచ్చునని, దీనికోసం ఇండియా, ఆఫ్రికా దేశాలలో విత్తన రంగంలో ఉండే విధాన నిర్ణేతలతో విత్తన రంగ అభివృద్దికి, విత్తన సాంకేతికత, పరిజ్ఞానంపై ఆలోచనలు, సలహాలు పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఇండో-ఆఫ్రికన్ సీడ్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయాలని చర్చించారు.

  • తెలంగాణ విత్తన రంగ అభివృద్దికి మునుముందూ పలు సమావేశాలు: తెలంగాణ విత్తన రంగాన్ని మరింత అభివృద్ది పరచాడానికి ప్రభుత్వ పరంగా తీసుకోవలిసిన విధానపరమైన నిర్ణయాలలో సలహాలు, సూచనలు, చేపట్టవలసిన కార్యక్రమాలు, విత్తనోత్పత్తిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో శిక్షణ కార్యక్రమాలు, విత్తన ఎగుమతులను ప్రోస్థహించడానికి చేపట్టవలసిన చర్యలు, దృష్టి సాదించవలసీన అంశాలపై రాబోయ్యే రోజుల్లో పలు సమావేశాలు నిర్వహించాలని ఈ సంధర్భంగా చర్చించారు.

  • విత్తనోత్పత్తితో ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చు: తెలంగాణ విత్తన పరిశ్రమ సామార్థ్యాన్ని చూసి ఆక్షర్యపోయిన FAO డైరెక్టర్ జనరల్, విత్తనోత్పత్తి ద్వారా రైతులు అధిక లాభాలు పొందటమే కాకుండా పరోక్షంగా వ్యవసాయంలో అధిక దిగుబదులు సాదించడానికి నాణ్యమైన విత్తనం అందించి సాదారణ రైతాంగానికి సహాయ పడుతున్నారని, అధెవిధంగా ప్రపంచంలో దాదాపు 58 దేశాలు ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నాయని, పటిష్టమైన విత్తన విధానాలు, పద్దతులు ఉన్నపుడే ఆకలితో అలమటిస్తున్న ప్రపంచ దేశాలలో ఆహార కొరత తీరుతుందని ఈ సమావేశం సంధర్భంగా FAO, DG, క్యూ డొంగ్యూ తెలిపారు.

  • ప్రాంతీయ స్థాయిలో సమావేశాలు: నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టి, దేశాల మద్య విత్తన ఎగుమతులు పెంచి, విత్తన పరిశ్రమను పటిష్టపరచడానికి FAO ప్రాంతీయ స్థాయి కార్యాలయాల్లో సమావేశాలు నిర్వహించాలని చర్చించారు.

ఈ సంధర్భంగా FAO, డైరెక్టర్ జనరల్ క్యూ డొంగ్యూ మాట్లాడుతూ, అభివృద్ది చెందనటువంటి దేశాలలో ఆహారోత్పత్తిని పెంచాలనే ఉద్యెశ్యoతో విత్తనాన్ని ఒక ముఖ్య అంశంగా ఎంచుకున్నామని, ఇందుకోసం నాణ్యమైన విత్తనోత్పత్తి పై శిక్షణ అవగాహాన కాయక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై హైదారాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించించినంధుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశంసించడం జరిగింది.

More Press Releases