తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 6న భేటీ - సమావేశ ఏర్పాట్లు పరిశీలించిన తెలంగాణ ఉప సీఎం భట్టి విక్రమార్క మల్లు

Related image

హైదరాబాద్, జూలై 03:: ఈ నెల 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ప్రజా భవన్ లో భేటీ కానున్న నేపథ్యంలో సమావేశ ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ విభాగాల అధికారులు ప్రజా భవన్ ను సందర్శించారు. సజావుగా ఏర్పాట్లు చేయాలని ఆయా విభాగాల అధికారులకు సూచనలు చేశారు. సమన్వయంతో సమావేశానికి తగు ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.


 ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రజావాణి ప్రత్యేక అధికారి దివ్య, రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ వెంకట రావు ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

       
     
     

Revanth Reddy
Congress
Chandrababu
Telugudesam
Mallu Bhatti Vikramarka

More Press Releases