విశ్వ కార్తికేయ బర్త్ డే సందర్భంగా అమరావతి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ నెం.1 కాన్సెప్ట్ పోస్టర్ విడుదల

Related image

బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టి.. హీరోగా ఎదిగారు విశ్వ కార్తికేయ.  కలియుగం పట్టణంలో అనే సినిమాతో నటుడిగా అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టు‌లతో బిజీగా ఉన్న విశ్వ కార్తికేయ తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా తన తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్‌లు వచ్చాయి. ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అమరావతి టూరింగ్ టాకీస్ ప్రొడక్షన్ నెం. 1గా విశ్వ కార్తికేయ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయ బాలయ్య ఫ్యాన్‌గా ఆడియెన్స్‌ను అలరించనున్నారు. ఆద్యంతం వినోదభరితంగా ఉండే ఈ సినిమాలో విశ్వ కార్తికేయ పాత్ర ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రకటించనున్నారు.

విశ్వ కార్తికయ బర్త్ డే సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. దునియాలా జిందగీ జిలేబి లెక్కుండాలే చిచ్చా అనే మాటలు, యాస చూస్తుంటే పక్కా మాస్ పాత్రను పోషించబోతోన్నారని అర్థం అవుతోంది. ఇక ఆ షర్ట్, ఆ డిజైన్ చూస్తుంటే ఎంత మాసీగా ఉండబోతోన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై బాలయ్య అనే స్లోగన్‌ను కూడా పెట్టేసి ఈ చిత్రంలో హీరో విశ్వ కార్తికేయ బాలయ్య ఫ్యాన్‌గా కనిపిస్తారనే హింట్ ఇచ్చేశారు. ప్రస్తుతం విశ్వ కార్తికేయ ఇండోనేషియా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు.

Vishwa Kathikeya
Tollywood
Movie News
Amaravathi Touring Talkies
Production No.1

More Press Releases