డెంగ్యూ మలేరియా నివారణ పోస్టర్ లాంచ్

Related image

డెంగ్యూ మలేరియా మరియు సీజనల్ వ్యాధుల నివారణ కొరకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు
 విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో డెంగ్యూ మలేరియా నివారణ పోస్టర్లు అధికారులతో లాంచ్ చేశారు.

 ఈ సందర్భంగా నగర కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య డెంగ్యూ, మలేరియా మరియు సీజనల్ వ్యాధులు అవి నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ, హెల్త్ సెక్రటరీలు, మలేరియా వర్కర్లు  ఏఎన్ఎం లు ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, దోమల నివారణకు నిర్వహిస్తున్న యాంటీ లార్వే ఆపరేషన్లు, ఎం ఎల్ ఆయిల్స్ స్ప్రే, అబెడ్ స్ప్రేలు చేస్తున్నారని, దోమలు పెరగకుండా ఉండేందుకు మురుగులేదా వర్షపు నీటి నిలువలు ఎక్కడా లేకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు.

 అంతేకాకుండా  స్టాప్ డయేరియా నినాదంతో, డయేరియా నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యోగాన కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో ఎలా ఉండాలి, ఆహారం వండే పదార్థాలు కానీ, వస్తువులు కానీ శుభ్రపరచాలని, మరుగుదొడ్లు వాడిన తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి అని, ఇంట్లో నీటి నిల్వలు లేకుండా చూసుకునేల అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారని  తెలిపారు.


 అంతేకాకుండా నగరవ్యాప్తంగా కలుషితం లేని త్రాగు నీటిని సరఫరా చేస్తున్నట్లు, అది నిర్ధారించుకోటానికి ఎప్పటికప్పుడు నీటినమున పరీక్షలు నిర్వహిస్తున్నట్లు దాదాపు ప్రతి సర్కిల్లో 300 రూపాయలు నగరం మొత్తం లో 1000 కి పైగా నీటినము నలుగు సేకరిస్తూ నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ, తాగునీటి పైప్లైన్ లు సైట్ లైన్ లో మురుగు నీటిలో కలవకుండా, డిసిల్టింగ్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నామని తెలిపారు

 ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ తో పాటు చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్ రావు చీఫ్ సిటీ ప్లానర్ జి బి జి ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ పి రత్నావళి, డిప్యూటీ సిటీ ప్లానర్ జూబిన్ చీరన్ రాయ్, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్ అకౌంట్ ఆఫీసర్ నరసింహమూర్తి, ప్రాజెక్ట్స్ ఆఫీసర్ యు సి డి వెంకటేశ్వరరావు, బయాలజిస్ట్ సూర్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.

     

More Press Releases