Zee5లో ట్రెండ్ అవుతున్న అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

Related image

తాను పోషించే ప్రతి పాత్రలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ.. వెండితెరపై బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు నటుడు అరవింద్ కృష్ణ.  అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్న ఆయన, S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అనే సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ZEE5లో ప్రసారమవుతూ టాప్ ట్రేండింగ్ లో నిలుస్తోంది.

ZEE5లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ఈ సినిమా ZEE5లో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పటి నుండి, ప్రతి వారం టాప్ ట్రెండ్స్‌లో ఉండటం విశేషం. అదే కంటిన్యూ చేస్తూ 8వ వారంలోనూ టాప్ ట్రెండ్స్‌లో ఉన్న ఈ సినిమా.. కంటెంట్ కింగ్ అని మరోసారి నిరూపించుకుంది.

సిట్‌ మూవీలో అరవింద్ కృష్ణ అసాధారణ నటనా ప్రదర్శన కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన రాబోయే చిత్రం ఎ మాస్టర్‌పీస్‌లో సూపర్‌హీరో పాత్రలో మెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అరవింద్ కృష్ణ సూపర్ హీరో లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సూపర్ హీరోగా స్టైలిష్ గెటప్‌లో అరవింద్ కృష్ణ యాప్ట్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో అతను కొన్ని ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేస్తారు. ఈ యువ హీరోకి ఇతర ఆసక్తికరమైన అసైన్‌మెంట్లు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేసుకుంటున్న అరవింద్ కృష్ణ.. సెలెక్టెడ్ గా కథలు ఎంచుకుంటున్నారు.

     

More Press Releases