ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించిన నిర్మాత TG విశ్వప్రసాద్

Related image

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ టెక్ గ్రూప్ అధినేత TG విశ్వప్రసాద్ గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యువ హీరోలు, అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి, నిర్మాత TG విశ్వప్రసాద్ గారికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ భారీగా గెలవడంతో సినీ పరిశ్రమ కూడా సంబరాలు చేసుకుంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత TG విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారు, కూటమి గెలిచినందుకు ఇటీవల గ్రాండ్ గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. 

ఇటీవల హైదరాబాద్ లోని ఓ పెద్ద కన్వెన్షన్ హాల్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి డైరెక్టర్ మారుతి, శ్రీవాస్, శ్రీరామ్ ఆదిత్య, హీరో తేజ సజ్జా, నిర్మాత SKN, దామోదర ప్రసాద్, బాలాదిత్య, సప్తగిరి, హైపర్ ఆది, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, సింగర్ మంగ్లీ.. ఇలా చాలా మంది నటీనటులు, సింగర్స్ వచ్చారు. అలాగే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. కూటమి విజయం కోసం కష్టపడిన పలువురిని నిర్మాత విశ్వప్రసాద్ గారు సత్కరించారు.

తాజాగా తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసి సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలు చర్చించారు. అనంతరం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఇలాంటి ఘన విజయం సాధించినందుకు అభినందించారు. పవన్ కళ్యాణ్ గారితో నిర్మాత విశ్వప్రసాద్ గారు గతంలో 'బ్రో' సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాగే జనసేన పార్టీకి కూడా విశ్వప్రసాద్ గారు అండగా నిలబడ్డారు.

       

More Press Releases