సందీప్​ కిషన్​, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఊరు పేరు భైరవకోన.. ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

Related image

హైదరాబాద్, 25 జూన్ 2024: ఆసక్తికరమైన మలుపులతో సాగే సీరియల్స్, ఆకట్టుకునే రియాలిటీ షోలతోనే కాకుండా వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో సూపర్హిట్ హారర్ థ్రిల్లర్తో మీ ముందుకు రాబోతోంది. సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఊరు పేరు భైరవకోన సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది. ఆసక్తికరమైన కథాంశంతో మిస్టరీ, అడ్వెంచరస్ హారర్ మూవీగా రూపొందిన ఊరు పేరు భైరవకోన జూన్ 30, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో, తప్పక చూడండి!


ఊరు పేరు భైరవకోన సినిమా కథ బసవ పాత్ర చుట్టూ తిరుగుతుంది. బసవ (సందీప్ కిషన్) తన స్నేహితుడు జాన్ (వైవా హర్ష)తో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు. అయితే, ఈ ఇద్దరితో పాటు గీత ( కావ్య థాపర్) కూడా ఆ ఊర్లోకి వస్తుంది. ఇంతకీ, ఆ భైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి ?, అక్కడ కనిపించే మనుషులు ఎవరు?  గరుడ పురాణంలో కనపడకుండా పోయిన నాలుగు పేజీలకి భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆదివారం జీ తెలుగులో ప్రసారమయ్యే ఊరు పేరు భైరవకోన సినిమా చూడాల్సిందే!

ప్రధాన నటీనటుల అద్భుతమైన నటన, ఆకట్టుకునే కథాంశంతో ఫాంటసీ, డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు & ఊరు పేరు భైరవకోన సిద్ధమైంది. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషించగా, వైవా హర్ష, వెన్నెల కిషోర్, పి. రవిశంకర్ ఇతర కీలకపాత్రలు పోషించారు. ఈ ఎమోషనల్ హారర్ అండ్ రివేంజ్ డ్రామాని జీ తెలుగు వేదికగా మీరూ చూసేయండి!

Ooru Peru Bhairavakona
Zee Telugu

More Press Releases