అంతర్జాతీయ యోగా దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్​, ఈ శుక్రవారం ఉదయం 8:30 గంటలకు మీ జీ తెలుగులో!

Related image

హైదరాబాద్, 20 జూన్ 2024: తెలుగు టెలివిజన్ పరిశ్రమలోని ప్రముఖ ఛానళ్లలో ఒకటైన జీ తెలుగు నిరంతరం వైవిధ్యమైన వినోదాత్మక ఫిక్షన్, నాన్-ఫిక్షన్ కార్యక్రమాలను అందిస్తోంది. అంతేకాదు ప్రేక్షకులను మెప్పించే వినోద కార్యక్రమాలతోపాటు విజ్ఞానం, ఆరోగ్యంపైనా దృష్టిసారిస్తూ పలు ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంతో ఆరోగ్యాన్ని పెంపొందించే సలహాలు సూచనలు అందిస్తున్న జీ తెలుగు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎపిసోడ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్నపూర్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు శిరీష నేర్పించే A-Z యోగాసనాలతోపాటు మంతెన సత్యనారాయణ ప్రత్యేక సూచనలతో ప్రత్యేక ఎపిసోడ్ ఆద్యంతం ఉపయుక్తంగా ఉండనుంది. 

ఆరోగ్యమే మహాయోగం యోగా డే స్పెషల్ ఎపిసోడ్, జూన్ 21 శుక్రవారం, ఉదయం 8:30 గంటలకు, మీ జీ తెలుగులో! 

ఆరోగ్యవంతమైన జీవనానికి అవసరైన విశేషాలతో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో యోగా దినోత్సవం సందర్భంగా మంతెన సత్యనారాయణ పిల్లలకు యోగాసనాల ప్రాముఖ్యతను బోధించనున్నారు. యోగాసనాలతో కూడిన ప్రత్యేక నృత్యంతో ఈ ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. ఈ ఎపిసోడ్కి ప్రత్యేక అతిథిగా ప్రముఖ యోగా గురువు శిరీష హజరై తన ఫిట్నెస్ జర్నీ, సాధించిన విజయాలు, తన రోజూవారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య రహస్యాలను పంచుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారు. ఆమె క్రమం తప్పకుండా చేసే పనులు, డైట్ప్లాన్, అభిరుచులు, అలవాట్లను ప్రేక్షకులతో పంచుకోవడంతోపాటు 20 మంది నిరుపేద చిన్నారులకు యోగా నేర్పించనున్నారు. గత 15 ఏళ్లుగా నిరుపేద చిన్నారులకు యోగా నేర్పిస్తున్న శిరీష.. లక్షలాది మందికి ఆరోగ్యాన్ని అందించడంలో ఆమె చేసిన కృషి అనిర్వచనీయం. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పలుఅంశాల మేళవింపుగా ఈ ఎపిసోడ్ అందరికీ ఉపయోగపడనుంది. 

అంతేకాదు, జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా 14 ఏళ్ల మాన్విక వినిపించిన వేణుగానం ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. 


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీ తెలుగు అందిస్తున్న ఆరోగ్యమే మహాయోగం ప్రత్యేక ఎపిసోడ్ని మీరూ మిస్ కాకండి!

More Press Releases