తెలంగాణ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి, ఆహార & వ్యవసాయ సంస్థ ప్రశంసలు!

Related image

విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను ప్రశంసించిన ఐక్యరాజ్య సమితి, ఆహార & వ్యవసాయ సంస్థ (FAO):

  • ఇటలి లోని రోమ్ నగరంలో ఐక్య రాజ్య సమితి, ఆహార & వ్యవసాయ సంస్థ (FAO), అసిస్టంట్ డైరెక్టర్ జనరల్ డా. బూకార్ టిజానీ,FAO, విత్తన విభాగం ప్రతినిధి, డా. చికెలు బా తో తెలంగాణ సీడ్స్, మేనేజింగ్ డైరెక్టర్, ISTA వైస్ ప్రేసెడెంట్ డా. కేశవులు సమావేశం

  • ISTA వైస్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి FAO లో అత్యునత స్థాయి సమావేశాలకు హాజరైన తెలంగాణ విత్తన సంస్థల, డైరెక్టర్ - డా. కేశవులు

  • తెలంగాణ విత్తన పరిశ్రమ, విత్తన రంగ అభివృద్ది, రాస్త్రాన్ని అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తీర్చి దిద్దాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను, విత్తన పరిశ్రమ సామార్థ్యాన్ని, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితులను ప్రేసెంటేషన్ ద్వారా వివరించిన తెలంగాణ సీడ్స్, డైరెక్టర్ డా. కేశవులు

  • అంతర్జాతీయ విత్తన భాండాగారం దిశగా విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రసంశించిన ఐక్యరాజ్య సమితి, FAO

  • FAO ముఖ్య ఉద్యెశo అయిన “అందరికీ ఆహారం” అనే నినాదం నెరవేరాలంటే వ్యవసాయ రంగంలో ఆహార ఉత్పత్తులు పెంచవలసిన అవసరం ఉంది, ఇందులో నాణ్యమైన విత్తనం కీలక పాత్ర పోషీస్తుంది- ఆహార & వ్యవసాయ సంస్థ (FAO)

  • విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సీడ్ బౌల్ కార్యక్రమాలను ఆసియా, ఆఫ్రికా దేశాలలో అమలుపరచి రెండు ప్రాంతాలలో విత్తన రంగాన్ని పటిస్ట పరుస్తాo- ఆహార & వ్యవసాయ సంస్థ (FAO)

  • జూన్ 2019 లో హైదరబాద్ లో ఆసియా ఖండం లోనే తొలి సారిగా జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సు లో భాగంగా FAO సహకారం తో దక్షిణ-దక్షిణ సహకారం క్రింద ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించాం-డా. కేశవులు.

  • ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై హైదారాబాద్ లో వర్క్ షాప్ నిర్వహించించినంధుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించిన-ఐక్య రాజ్య సమితి (FAO)

  • తెలంగాణలో 1500 గ్రామాలలో, 3 లక్షల మంది రైతులు, దాదాపు 7 లక్షల ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టి, ఇండియాలో వివిధ రాష్త్రాలకు కావలిసీన 60% విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా 20 దేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి చేసి, తెలంగాణాలో 400 విత్తన కంపెనీలు దాదాపు 5000 కోట్ల విత్తన వ్యాపారం జరుగుతుంది-డా. కేశవులు 

  • తెలంగాణ రాష్ట్రానికి నాణ్యమైన విత్తనోత్పత్తిలో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలను & విత్తన పరిశ్రమ సామార్థ్యాన్ని, అభివృద్దిని ఐక్య రాజ్య సమితి యొక్క అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ & ఆహార సంస్థ (FAO) గుర్తించింది-డా. బి. రాజేందర్, IAS, వ్యవసాయ విభాగం మంత్రి, FAO

అంతర్జాతీయ ఆహార & వ్యవసాయ సంస్థ (FAO) :

1945 సంవత్సరంలో ఇటలి దేశంలో రోమ్ లో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార & వ్యవసాయ సంస్థ అయిన FAO, విశ్వ వ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఆహార భద్రతను కల్పించి, ఆకలిని జయించడానికి సాంకేతికంగా అంతర్జాతీయ ప్రయత్నాలకు దారిచూపుతుంది. ముఖ్యంగా ఈ సంస్థ అభివృద్ది చెందిన & అభివృద్ది చెందుతున్న దేశాలకు సేవలను అందిస్తూ, పలు ఒప్పందాలు & విధి, విధానాలను చర్చించు కోవడానికి ఒక తటస్థ వేధికగా పనిచేస్తుంది. అంతేకాకుండా FAO ఒక విజ్ఞాన, సాంకేతిక & సమాచార వనరుగా ఉండి అభివృద్ది చెందుతున్న దేశాలలో వ్యవసాయం, విత్తనోత్పత్తి, అడవుల పెంపకం, చేపల పెంపకం, సమీకృత వ్యవసాయ పద్దతులలో ఆధునికత & మెరుగుదలకు సహాయ పడి, ప్రభుత్వాలకు విధాన పరమైన సలహాలు, సూచనలు  అందిస్తూ “అందరికీ ఆహారం” అనే నినాధం తో మంచి పోషక ఆహారం & ఆరోగ్య భద్రతను నిశ్చయిస్తుంది  

ఆహార భద్రతకు మూలం నాణ్యమైన విత్తనం:

ఈ విధంగా FAO ముఖ్య ఉద్యెశ్యo అయిన “అందరికీ ఆహారం” అనే నినాధం కార్యరూపం దాల్చి, ఆహార ఉత్పత్తులు ఘననీయంగా పెరిగి ఆహార భద్రత కల్పిచాలంటే వ్యవసాయ రంగం లో ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, ఈ నేపథ్యంలో వ్యవసాయంలో దిగుబడులను పెంచడం లో నాణ్యమైన విత్తనం అనేధి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీని దృస్తీలో ఉంచుకొని FAO విత్తనాన్ని ఒక ముఖ్య అంశంగా భావించి వివిద దేశాలలో నాణ్యమైన విత్తనోత్పత్తి చేపట్టడానికి కావలిసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చేయూతనిస్తుంది. 

ఐక్యరాజ్య సమితి ఆహార & వ్యవసాయ సంస్థ (FAO) ఆసిస్టంట్ డైరెక్టర్ జనరల్, డా. బూకర్ టిజానీతో ప్రత్యేక సమావేశం:

ఫిబ్రవరి 2, 3 తేదీలలో ఇటలీ దేశం లోని రోమ్ నగరంలో ఉన్నFAO ప్రపంచ ప్రదాన కార్యలయం లో FAO ఆసిస్టంట్ డైరెక్టర్ జనరల్, డా. బూకర్ టిజానీ తో తెలంగాణ విత్తన సంస్థల, డైరెక్టర్, ISTA వైస్ ప్రెసిడెంట్ డా. కేశవులు, తెలంగాణ ప్రాంత వాసి అయిన FAO వ్యవసాయ శాఖ విభాగం మంత్రివర్గ్యులు డా. రాజేందర్, IAS సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి FAO డిప్యూటీ డైరెక్టర్, డా. రెమి నోనో వొండిమ్ కూడా హాజరయ్యాడు.

ముఖ్యంగా ఈ సమావేశం జూన్ 2019 లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సు (ISTA) భాగంగా FAO సహకారంతో దక్షిణ-దక్షిణ సహకారం క్రింద ఆఫ్రికా దేశాల ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై నిర్వహించిన ప్రత్యేక వర్క్ షాప్ కు అనుసంధానంగా (Follow up) ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో తెలంగాణ విత్తన పరిశ్రమ, తెలంగాణ విత్తన రంగ అభివృద్ది, అదేవిధంగా తెలంగాణ రాస్త్రాన్ని అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తీర్చి దిద్దాడానికి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను, తెలంగాణ విత్తన పరిశ్రమ & తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు & మౌలిక సదుపాయాల గురించి ప్రేసెంటేషన్ ద్వారా తెలంగాణ సీడ్స్ డైరెక్టర్ డా. కేశవులు వివరించడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో 1500 గ్రామాలలో, 3 లక్షల మంది రైతులు, దాదాపు 7 లక్షల ఎకరాలలో విత్తనోత్పత్తి చేపట్టి ఇండియాలో 15 రాష్త్రాలకు కావలిసీన 60% విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా 20 దేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

FAO విత్తన విభాగం ప్రతినిధి డా. చికెలు బా తో ప్రత్యేక సమావేశం:

అధెవిధంగా FAO విత్తన విభాగం అధికారి అయిన డా. చికెలు బా & విత్తన రక్షణ విభాగం అధికారి డా. శావన్ మేకుగురే తో డా. కేశవులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష పద్దతులు, విత్తన పరిశ్రమ అభివృద్దికి దృస్తి సాదించాల్సిన అంశాలపై ఈ సంధర్భంగా చర్చించారు.

FAO సహకారంతో ఆఫ్రికా దేశాల విత్తన ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం:

ఈ సంధర్భంలో ఆసియా-ఆఫ్రికా ఖండాల్లో దక్షిణ భాగంలో ఉన్న దేశాల మద్య దక్షిణ-దక్షిణ సహకారం క్రింద FAO, రోమ్ వారి సహకారంతో, పరస్పర విత్తన సాంకేతిక పరిజ్ఞాన సహకారం, విత్తన ఎగుమతులు దిగిమతుల కోసం మార్కెటింగ్ అనుసందానం కోసం ప్రత్యేక వర్క్ షాప్ ను, హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సుకు ముందు జూన్ 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ కు కాంగో, బుర్కినాఫాసో, ఘనా, లైబీరియా, నైజీరియా, మొజాంబిక్, జ్వింబాంబే, ఉగాండా మొదలగు దేశాల నుంచి  55 మంది చిన్న మద్య తరహా విత్తన కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ రంగ సంస్థల అదికారులతో పాటు, ఇండియా లో ఉన్న వివిధ విత్తన కంపెనీల నుంచి 50 మంది ప్రతినిదులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన వర్క్ షాప్ లో, నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష పద్దతులపైనా ఆఫ్రికా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తరువాత జరిగిన  ముఖాముఖీ చర్చలలో, ఆఫ్రికా & అసియా ఖండాల మద్య పరస్పర విత్తన ఎగుమతులు, దిగుమతులు, విత్తన వాణిజ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చించడం జరిగింది.

విత్తనోత్పత్తి పై హైదారాబాద్ లో నిర్వహించిన FAO వర్క్ షాప్ సిఫారసుల గురించి చర్చ:

ఈ వర్క్ షాప్ ద్వారా వచ్చిన 10 సిఫారసులలో ముఖ్యమైన ఈ క్రింది అంశాలను FAO అధికారులతో చర్చిండo జరిగింది.

  • విత్తన రంగ అభివుద్దికి FAO నిర్మాణాత్మక పాత్ర వ్యవహరించాలి: తెలంగాణ విత్తన రంగ అభివృద్దిని, సాదించిన పురోగతిని ఆదారంగా చేసుకొని ఇతర FAO భాగస్వామ్య దేశాలలో విత్తన రంగాన్ని అభివృద్ది చేసి, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి.

  • అవదులు, అవరోధాలు లేకుండా విత్తన ఎగుమతులు ప్రోస్థహించడం :  విత్తన దృవీకరణ, విత్తన పరీక్ష ప్రమాణాలు, పంట రకాల పరీక్ష పద్దతులలో భాగస్వామ్య దేశాలలో ఒకే రకమైన నియమాలను పాటించి అవరోధాలు లేకుండా విత్తన ఎగుమతులు ప్రోస్థహించడం

  • విత్తన సాంకేతికత & పరిశోదనను మెరుగుపరచడం : ఆసియా ఆఫ్రికా ఖండాలలో దక్షిణ భాగంలో ఉన్న దేశాలలో విత్తన పరిశ్రమకు ఉపయోగపడే విధంగా విత్తన సాంకేతికత & పరిశోదనను మెరుగుపరచడం

  • విత్తన సౌకర్యాలు కల్పించడం : ఆఫ్రికా దేశాలలో ఉన్న స్థానిక విత్తన కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని, వితనోత్పత్తి & విత్తన పరిశోదన లో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించడం.

విత్తన రంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రసంశించిన FAO, ADG, బూకార్ టిజానీ:

ఈ సమావేశాల సంధర్భంగా FAO ఆసిస్టంట్ డైరెక్టర్ జనరల్ బూకర్ టిజానీ మాట్లాడుతూ, హైదరాబాద్ లో ఆసియా ఖండం లోనే తొలి సారిగా జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సు (ISTA) భాగంగా FAO సహకారం తో సౌత్-సౌత్ సహకారం క్రింద ఆసియా & ఆఫ్రికా దేశాల చిన్న & మద్య తరహా విత్తన పరిశ్రమ ప్రతినిధులకు నాణ్యమైన విత్తనోత్పత్తి, విత్తన ఎగుమతులపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రసంశించారు. అధెవిధంగా అంతర్జాతీయ విత్తన భాండాగారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోయే సీడ్ బౌల్ కార్యాక్రమాలకు FAO నుంచి సహకారం అందిస్తామని బూకర్ టీజానీ తెలిపారు.

రాబోయ్యే రోజుల్లో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం:

అంతేకాకుండా తెలంగాణాను అంతర్జాతీయ విత్తన భాండాగారంగా తీర్చి దిద్దాడానికి రాబోయ్యే రోజుల్లో సంబందిత మంత్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, విత్తన రంగ అభివృద్దికి 3 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించి, విత్తన రంగం లో స్టేక్ హోల్డర్స్ కి నాణ్యమైన విత్తనోత్పత్తి & మార్కెటింగ్ అవకాశాలపై ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యాక్రమాలు నిర్వహిస్తామని, దీనికి FAO కూడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. 

అధెవిధంగా తెలంగాణ ప్రాంత వాసి అయిన FAO వ్యవసాయ శాఖ విభాగం మంత్రివర్గ్యులు డా. రాజేందర్, IAS మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి నాణ్యమైన విత్తనోత్పత్తిలో ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలను & విత్తన పరిశ్రమ అభివృద్దిని ఐక్య రాజ్య సమితి యొక్క అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ & ఆహార సంస్థ (FAO) గుర్తించిందని, ఇది తెలంగాణాకు మంచి అవకాశం అని, విత్తన రైతులు కూడా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందాన్ని, తద్వారా తెలంగాణ రాష్ట్రంలో విత్తన పంటల సాగు విస్తీరణం పెరిగే అవకాశం ఉంధని, అంతే కాకుండా రాన్నున్నా రోజుల్లో నిర్వహించే మంత్రుల సమావేశం కూడా తెలంగాణ విత్తన రంగ అభివృద్దికి మరింత దోహద పడుతుందని ఈ సంధర్భంగా తెలిపారు.

More Press Releases