జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ విజేతలుగా శ్రీసత్య-సంకేత్​!

Related image

హైదరాబాద్, 14 మే 2024 : జీ తెలుగు సెలెబ్రిటీ డాన్స్ రియాలిటీ షో సూపర్ జోడీ గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. ఎనిమిది సెలబ్రిటీ జంటలు సీజన్ మొత్తం తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత వారాంతంలో ప్రతిష్టాత్మక టైటిల్ కోసం హోరాహోరీగా సాగిన పోటీ ముగిసింది.

మే 12న ప్రసారమైన సూపర్ జోడీ ఫినాలేలో ఫైనల్కి చేరిన అందరూ అద్భుత ప్రదర్శనలతో టైటిల్ దక్కించుకునేందుకు పోటీపడ్డారు. గట్టి పోటీ అనంతరం న్యాయనిర్ణేతలు డైనమిక్ జోడీ శ్రీ సత్య, సంకేత్ను విజేతలుగా ఎంపిక చేశారు. తమ అద్భుత ప్రదర్శనలతో జడ్జిలతోపాటు ప్రేక్షకులను మెప్పించిన వీరిని విజేతలుగా ప్రకటించారు. షో ఆరంభం నుంచీ అంకితభావంతో శ్రమించిన శ్రీ సత్య, సంకేత్ సూపర్ జోడీ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.


ఈ సందర్భంగా విజేత శ్రీసత్య మాట్లాడుతూ ‘సూపర్ జోడీ టైటిల్ గెలవడం ఒక కల లాంటిది. ప్రొఫెషనల్ డ్యాన్సర్ని కాకపోయినా, సంకేత్ ఎనర్జీకి సరిపోయేందుకు చాలా కష్టపడ్డాను. టైటిల్ దక్కించుకోవడానికి అందరూ చాలా కష్టపడ్డారు. చివరకు పోటీ చాలా కష్టతరమైంది. ఈ ప్రయాణం నా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది, ఈ మరచిపోలేని అనుభవానికి జీ తెలుగు ఛానల్కు రుణపడి ఉంటాను'.

సూపర్ జోడీ ప్రేక్షకులను అలరించడమే కాకుండా సెలబ్రిటీలు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక వేదికను కల్పించింది. ఆకట్టుకునే, వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకులకు అందించడంలో జీ తెలుగు నిబద్ధతను ఈ షో విజయం మరోసారి రుజువు చేసింది.

Super Jodi
Zee Telugu Super Jodi Winners
Dance Reality Show
Super Jodi Grand Finale
Sree Satya
Sanketh

More Press Releases