పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ఆర్కే సాగర్ ప్రచారం

Related image

బుల్లితెరపై ఆర్కే సాగర్‌కి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొగలి రేకులు సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా మారిపోయారు. సినిమాలతోనూ తన అభిమానుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'ది 100' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. సినిమా ప్రమోషన్స్ చేస్తూనే.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కోసం రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తరుపున ఇప్పటికే సెలెబ్రిటీలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ సైతం తన వంతుగా ప్రచారాన్ని చేపట్టారు. నాదెండ్ల మనోహర్‌తో పాటు సాగర్ చేసిన ఈ ప్రచారానికి ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది.

'గాజు గ్లాసు గుర్తుకే ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి' అని సాగర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. రీసెంట్‌గానే మెగా మదర్ అంజనమ్మ చేతులు మీదుగా రిలీజ్ చేయించిన ది 100 టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Pithapuram
Pawan Kalyan
RK Sagar

More Press Releases