15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024లో బహుళ అవార్డులను అందుకున్న రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్

Related image

 హైదరాబాద్:  నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి (CIDC) నిర్వహించిన 15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ 2024లో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, తాము అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు వెల్లడించింది. నిర్మాణ రంగంలో శ్రేష్ఠత, స్థిరత్వం మరియు సామాజిక ప్రభావం చూపటం పట్ల కంపెనీ చూపుతున్న నిబద్ధతకు గుర్తిస్తూ పలు విభాగాలలో కంపెనీ  గౌరవించబడింది.

ప్లానింగ్ కమిషన్ (ఇప్పుడు నీతి అయోగ్) మరియు భారతీయ నిర్మాణ పరిశ్రమ సంయుక్తంగా  ఏర్పాటు చేసిన CIDC భారతదేశంలో నిర్మాణ రంగం కోసం ఒక అంబ్రెల్లా   సంస్థగా పనిచేస్తుంది. 2009లో ప్రారంభించబడిన విశ్వకర్మ అవార్డులు, వివిధ విభాగాలలో పరిశ్రమలోని పలు పరిశ్రమల యొక్క విశేషమైన విజయాలు మరియు సహకారాలను గుర్తించి, గౌరవించడం లక్ష్యంగా పెట్టుకుంది.

పరిశ్రమకు రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అందించిన విశిష్ట సహకారానికి గానూ  ఈ  ప్రతిష్టాత్మక వేడుకలో కంపెనీకి బహుళ గుర్తింపులను క్రింది విధంగా అందించారు :

ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులకు అచీవ్మెంట్ అవార్డు: హైదరాబాద్లోని జవహర్ నగర్లోని IMSWM ప్లాంట్కు ఆనుకుని ఉన్న చెరువుల పునరుద్ధరణ మరియు స్థిరీకరణ వరకు లెగసీ లీచెట్  శుద్ధి మరియు నిర్మూలనలో ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను గుర్తించడం.

సాంఘిక అభివృద్ధి మరియు ప్రభావాన్ని సృష్టించడం కోసం అచీవ్మెంట్ అవార్డు: కంపెనీ చేపట్టిన ముఖ్యమైన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించడం మరియు ప్రభావవంతమైన కార్యక్రమాల ద్వారా పర్యావరణ అనుకూల అభివృద్ధికి దాని స్థిరమైన నిబద్ధత.

ఉత్తమ వృత్తిపరంగా నిర్వహించబడే కంపెనీగా అచీవ్మెంట్ అవార్డు: నిర్మాణ డొమైన్లో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యొక్క అసాధారణమైన వృత్తి నైపుణ్యం మరియు నిర్వహణ పద్ధతులకు ప్రశంసలు అందుకుంది.

నిర్మాణం ఆరోగ్యం, భద్రత & పర్యావరణం కోసం అచీవ్మెంట్ అవార్డు:  ఆరోగ్యం, భద్రత మరియు పర్యావరణ స్థిరత్వాన్ని నిర్ధారించడంపై అచంచలమైన దృష్టిని వెల్లడిస్తూ కంపెనీ  ఇటీవల తమ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, “రామ్కీ వన్ ఒడిస్సీ” కోసం అవార్డు అందుకుంది. 

ఈ ప్రశంసలు నిర్మాణ పరిశ్రమలో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యొక్క శ్రేష్ఠత మరియు ఆవిష్కరణల యొక్క మహోన్నత ప్రయత్నాలను నొక్కి చెబుతున్నాయి. కంపెనీ యొక్క సమగ్ర విధానం, సామాజిక బాధ్యత , పర్యావరణ సారథ్యంతో నాణ్యతా హామీని ప్రదర్శించటం , CIDC ద్వారా సముచితంగా గుర్తించబడింది.

రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యంచర్ల రత్నాకర నాగరాజా మాట్లాడుతూ ఈ గుర్తింపుకు పట్ల తమ కృతజ్ఞతలు తెలిపారు . స్థిరమైన మరియు సమ్మిళిత అభివృద్ధికి సంస్థ యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆయన మాట్లాడుతూ  "సామాజిక బాధ్యత మరియు పర్యావరణ సారథ్యం పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరిస్తూ  శ్రేష్ఠత ను అందించడంలో మా అంకితభావాన్ని ఈ అవార్డులు పునరుద్ఘాటించాయి. సమాజానికి మరియు నిర్మాణ పరిశ్రమకు సానుకూలంగా చేయూత అందించాలనే మా లక్ష్యంలో మేము స్థిరంగా ఉన్నాము" అని అన్నారు. 

తమకు అందించిన గౌరవానికి CIDCకి హృదయపూర్వక ధన్యవాదాలను రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లిమిటెడ్ తెలియజేస్తుంది.  ఆవిష్కరణ, స్థిరత్వం మరియు సామాజిక ప్రభావం ద్వారా నిర్మాణ పరిశ్రమలో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పడానికి తమ నిబద్ధతను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేసింది.

More Press Releases