పలువురిని అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్!
అక్వా డెవిల్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్వర్యంలో ఫిభ్రవరి 02 న జరిగిన 21 వ కృష్ణా రివర్ క్రాస్ స్విమ్మింగ్ కాంపిటిషన్స్ లో 75 సంవత్సరాల వయస్సు గలిగిన మర్రి లక్ష్మారెడ్డి 1.5 కీలోమీటర్ల ను 50.49 నిమిషాలలో స్విమ్మింగ్ చేసి విజయం సాధించి నేటి యువతకు అదర్శం, స్పూర్తిగా నిలిచినందుకు తెలంగాణ రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. అదే విధంగా ఇదే కాంఫిటీషన్స్ లో మహిళల విభాగంలో 1.5 కీలోమీటర్ల విభాగంలో 26.58 నిమిషాలలో ఈదిన 47 సంవత్సరాల వయస్సు గల గోలి శ్యామల మెుదటి స్థానం సాధించిన సందర్భంగా అభినందించారు.
హర్యాణలో ఫిభ్రవరి 7 నుండి 12 వరకు దేవిలాల్ స్టేడియంలో జరగనున్న జాతీయ మాస్టర్స్ అథ్లేటిక్స్ చాంఫియన్స్ ట్రోఫిలో పాల్గోంటున్న తెలంగాణ రాష్ట్రం నుండి 220 మంది మాష్టర్స్ క్రీడాకారులు దరించే ట్రాక్ షూట్ ను మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో తెలంగాణ మాష్టర్స్ అసోసియేషన్ శాశ్వత అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘీరు ప్రభు కుమార్ గౌడ్, కోశాధికారి డి. లక్ష్మీ, వైస్ ప్రసిడెంట్ శంకర్, బండి శ్రీనివాస్, అసోసియేషన్ సభ్యులు పాల్గోన్నారు.
12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శణం మోగిలయ్య ప్రముఖ కిన్నెర వాయిధ్య కళాకారుడిని అభినందించిన మంత్రి