రాజోలు నియోజకవర్గంలో మళ్ళీ జనసేన జెండా ఎగరాలి
రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్ళీ ఎగురవేయాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో జనసేనను గెలిపించిన ఆ నియోజకవర్గం ఓటర్లు నాడు చూపించిన ఆదరణను నేడు మరింత పొందాలని.... వారు మన మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకొంటామన్నారు.
బుధవారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ దేవ వరప్రసాద్ సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిస్థితిపై చర్చించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా అనుసరించాల్సిన విధానాలను పార్టీ అధ్యక్షుల వారు వివరించారు. అనంతరం శ్రీ వరప్రసాద్ కు ఎన్నికల ప్రక్రియలో భాగమైన ప్రచారం, నామినేషన్ దాఖలకు సంబంధించిన నియమావళి, నిబంధనలతో కూడిన పత్రాలను అందచేశారు.