పేదలకు ఇళ్ళతో సంపూర్ణ హక్కులు కల్పించిన జగనన్న ప్రభుత్వం - నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
పేదలకు సొంతింటి కలను నెరవేర్చడమే కాకుండా సొంత ఇంటికి సంపూర్ణ హక్కులను వాళ్ళకి కల్పించి నిజమైన యజమానిని చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని విజయవాడ నగరపాలక సంస్థ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల స్థానిక 46వ డివిజన్లో 143 సచివాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నగరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గవర్నమెంట్ ఆర్డర్ 463 ప్రకారం పట్టా పంపిణీలు జరుగుతున్నాయని, 46వ డివిజన్లో 793 పట్టాలు ఇచ్చారని, అలాగే పశ్చిమ నియోజకవర్గం మొత్తంలో దాదాపు 7వేలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. విఎంసి కాలనీలో కల్పించిన వసతులన్నీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్పించినవే అని, ఈ పట్టాల ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్లకి సర్వహక్కులు, ఆ భూమిపైన వాళ్ళ ఇళ్ళ పైన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్లాట్లు కేటాయించిన లబ్ధిదారులు వారికి సొంతిల్లు ఉన్నా వారి ఆర్థిక అవసరాలు అయినా వైద్యం, పిల్లల చదువు, పిల్లల వివాహం మరియు ఇతర ఏ అవసరమైన బ్యాంక్ మరియు ఇతర ఆర్థిక సంస్థల నుండి లోన్ పొందలేని స్థితిలో ఉన్నారని దానివల్ల అధిక వడ్డీకి అప్పులు చేసుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉండేదని అన్నారు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సమస్యను గుర్తించి వారికి సంపూర్ణ హక్కులను కల్పించాలనే ఉద్దేశంతో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని అన్నారు. దీని ద్వారా లబ్ధిదారులు వారు వినియోగించుకోవడమే కాకుండా అవసరమైన పరిస్థితుల్లో వారు బ్యాంకులో తాకట్టు పెట్టుకునేందుకు వీలుగా ఉండేటట్టు పట్టాలు ఇస్తుంది మన జగనన్న ప్రభుత్వం అని అన్నారు. క్రమబద్ధీకరణ చేసిన దగ్గర నుండి ఐదు సంవత్సరాల తర్వాత వారికి రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తారని, అలా ఇప్పుడు ఇచ్చే పట్టాలకు ఆగస్టు 2025 నుండి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పిస్తున్నారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చటం. నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్ళు ద్వారా ప్రజలందరికీ ఇళ్ల స్థలాలను సంపూర్ణ హక్కులతో కల్పిస్తున్నారని అన్నారు.