సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు

Related image

సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు.

 రాష్ట్రంలోని 65 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టాటా గ్రూప్ కంపెనీ. 

 సంబంధిత ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేసిన అధికారులు. 

 రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయనున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (TTL). 

 ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కొత్త ప్రాజెక్టును చేపడుతున్న టాటా టెక్నాలజీస్ 

 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంతరాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణ. 

 ఈ 2024-25 విద్యాసంవత్సరం నుంచే ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.
 

Revanth Reddy
Mallu Bhatti Vikramarka
Sridhar Babu

More Press Releases