జగన్ గెలుపు -మహిళల గెలుపు- వాసిరెడ్డిపద్మ

Related image

రాష్ట్రంలోని కోట్లాదిమంది మహిళలు హృదయ హారతి పడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిగ్ థాంక్స్ చెబుతున్నామని  శ్రీమతి వాసిరెడ్డి పద్మ అన్నారు..

వైయస్సార్సీపి కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి శ్రీమతి వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..

ముందుగా కేక్ కట్ చేసి మహిళల విభాగం  రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ  పోతుల సునీత, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణికి తినిపించారు..

ఈ సందర్భంగా శ్రీమతి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ  తండ్రి, బిడ్డలు , కుటుంబంలో ఎవరు మహిళలకు ఇవ్వని గుర్తింపు సమానత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు..

మహిళల పెరటి ఇల్లు,  ఇళ్ల పట్టాలు ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతి పథకములోనూ  మహిళలకు ఇచ్చిన గుర్తింపుతో మహిళలకు గుర్తింపు సమానత్వం వచ్చిందన్నారు..

దేశంలో మహిళా ప్రధానిగా చేశారని, చాలా రాష్ట్రాల్లో సీఎంలు కూడా చేశారని కానీ మహిళల కోసం ఎంతైనా చేస్తామనేది చేసి చూపించింది సీఎం జగన్ మాత్రమే .

వై నాట్ 175 అమలు చేసి చూపించేది మహిళల కె సాధ్యమన్నారు..

ఎన్నికలప్పుడు మహిళల కోసం అంటూ డప్పులు పోయింది.. విజన్ లేని గుడ్డి పాలన చంద్రబాబు హయాంలో సాగిందన్నారు.

ప్రతి మహిళా తాన అరచేతిలో ఫోన్ ద్వారా రక్షణ పొందే స్థాయికి దిశా యాప్ పనిచేస్తుందన్నారు.. సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ యాప్ మహిళల కు రక్షణ, ధైర్యాన్ని ఇస్తుందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళకు 50/ శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేసిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.. ఇది మహిళల విజయం అన్నారు.

ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రచారం చేయడానికి  మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు..

పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేయడానికి నేను సిద్ధం

కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మహిళ విభాగం అధ్యక్షులు పోతుల సునీత, వరుదు కళ్యాణి, ఉపాధ్యక్షులు, జోనల్ కమిటీ చైర్మన్ లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అమ్మాజీ, ఏపీఐసీ చైర్మన్ బండి పుణ్యశీల, మహిళా అడ్వకేట్ లు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases