ప్రేమ ఎంత మధురం అను‌‌-ఆర్యల నిండు నూరేళ్ల సావాసం, ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో!

Related image

హైదరాబాద్, 07 మార్చి 2024: ఆసక్తికరమైన మలుపులు, ఆకట్టుకునే కథలతో సాగే సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం పంచుతున్న ఛానల్ జీ తెలుగు. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో అలరించే జీ తెలుగు తాజాగా పిఠాపురం వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. అశేష ప్రేక్షకాదరణ పొందుతున్న జీ తెలుగు సీరియల్స్ ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమాన ప్రేక్షకుల మధ్య ఘనంగా జరిగిన కార్యక్రమం అను - ఆర్యల నిండు నూరేళ్ల సావాసం, మార్చి 10 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో!

జీ తెలుగు ఇటీవల పిఠాపురంలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది.  ప్రముఖ యాంకర్ శ్యామల వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న 'నిండు నూరేళ్ల సావాసం', 'ప్రేమ ఎంత మధురం' నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించడమే కాకుండా పలు బహుమతులను కూడా పంచి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు. ఈ రెండు సీరియల్స్లో తమ నటనతో అలరిస్తున్న బాలనటుల ప్రదర్శనలు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు, సరిగమప గాయనీగాయకుల ప్రత్యేక ప్రదర్శన వీక్షకుల హృదయాలను హత్తుకుంది.

నాలుగేళ్లుగా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న జీ తెలుగు సీరియల్ ప్రేమ ఎంత మధురం కథానాయకుడు శ్రీరామ్ వెంకట్ (ఆర్యవర్ధన్) ఈ కార్యక్రమం ద్వారా తన అభిమానులను పలకరించి మరింత ఉత్సాహాన్ని జోడించారు. అంతేకాదు ఈ సీరియల్ నుంచి వర్ష (అను), మహేశ్వరి (మాన్సీ), కరమ్ (నీరజ్) కూడా పాల్గొని అభిమానులను అలరించారు. ఇక, మొదటి ఎపిసోడ్ నుంచీ విశిష్ట ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నటీనటులైన రిచర్డ్ జోస్ (అమరేంద్ర), పల్లవి గౌడ (అరుంధతి), నిసర్గ గౌడ (భాగమతి), నవ్య రావు (మనోహరి)తోపాటు పిల్లలు కూడా పాల్గొని తమ అద్భుత ప్రదర్శనలతో మరచిపోలేని అనుభూతుల్ని పంచారు.

జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. దేవాలయాల సందర్శన నుంచి అభిమానుల ఇళ్లలో ఆనందాన్ని పంచడం వరకు ప్రేమ ఎంత మధురం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులు చెరగని అనుభూతులు పంచారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా మీరూ మిస్ కాకుండా చూసేయండి!
అంగరంగ వైభవంగా జరిగిన అను-ఆర్యల నిండు నూరేళ్ల సావాసం ప్రత్యేక కార్యక్రమం, ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

Prema Entha Madhuram
Zee Telugu
Nindu Nurella Savasam
Telugu Serials

More Press Releases