జగనన్న కాలనీల ఇళ్ళ పట్టాల పంపిణీ
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 46వ డివిజన్లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 5వ సచివాలయం, కె ఎల్ పార్కులో జగనన్న కాలనీల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం లో పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ 323 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల స్థలాలను ఇవ్వటమే కాకుండా ఇళ్ళను రిజిస్ట్రేషన్ కూడా చేసిన ఘనత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిదే అని, ఇటువంటి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ లో ఉంటే పేదరికం, నిరుద్యోగుల సమస్యలు తగ్గుతాయని మహిళలు ఆర్థికంగా బలపడతారని, స్కూల్ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం లో చదివి రాష్ట్రంలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నారని. మిడ్ డే మీల్స్ పథకాలతో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని కల్పిస్తూ ఆరోగ్యవంతులగా చేస్తూ ఒక మేనమామల జగనన్న విద్యార్థులను చూసుకుంటున్నారు అన్నారు. మన రాష్ట్రంలో వాలంటీర్, సచివాలయం వ్యవస్థకు నాంది పలికి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తక్షణం తీరుస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ 1 హెలెన్ , సచివాలయం సిబ్బంది, యు సి డి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.