అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

Related image

"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేసింది. అందులో సినిమా రంగం నుండి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు.
 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ Mr నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నా. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

VN Aditya
Tollywood
Doctorate
George Washington University

More Press Releases