మేడారం లో మెరుగైన వైద్య సదుపాయాలు

Related image

మేడారం,  ఫిబ్రవరి -21:   మేడారం జాతరకు తరలివస్తున్నా ప్రజలకు ఎటువంటి వైద్య పరమైన ఇబ్బంది లేకుండా వైద్యం  అందిస్తున్న వైద్య బృందం జాతరలో మొదటి రోజు, అయిన బుధవారం సుమారు వెయ్యి మంది కి పైగా భక్తులకు  మలేరియా, వైరల్ ఫీవర్, పీడ్స్ మొదలైన  చికిత్స అందించడం జరిగింది మరియు  పరిస్థితి విషమంగా ఉన్నవారిని  ములుగు మెడికల్  కాలేజీ ఆసుపత్రికి పంపిచడం జరుగుతుంది అలాగే వేళలావారిగా 15 మంది వివిధ శాఖలకు సంబంధించిన డాక్టర్లు మరియు 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు అలాగే జాతరలో 33  మొబైల్ హెల్త్ సెంటర్లు  అందుబాటులో ఉన్నాయి అని డాక్టర్ మధుసూదన్ గారు తెలిపారు. 


నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరలో ఉచిత వైద్యం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం. జిల్లా వైద్యశాఖ, ఆరోగ్యశాఖ ములుగు బుధవారం రోజున వైద్య శాలలో దాదాపుగా 1000 మందికి పైగా మెరుగైన  వైద్యం అందించడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉన్నటువంటి వారిని తాడ్వాయి వైద్యశాల లేదా ములుగు వైద్య  కళాశాలకు తరలించడం జరుగుతుంది. వివిధ రకాల ఇబ్బందులు, విష జ్వరాలు, పిడ్స్, డయబెటిక్, ఆక్సిడెంట్స్ మరియు దర్శనమార్గం లో  నీరసంగా ఉన్నవారికి  వైద్య సేవలు అందించడం జరుగుతుంది.

Medaram Jatara
Health Facilities

More Press Releases