పగిడిద్ద రాజు పూజరుల విడిది కేంద్రాన్ని ప్రారంభించిన పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

Related image

ప్రెస్ రిలీజ్:  20/02/2024, తాడ్వాయి మండలం ములుగు జిల్లా

పగిడిద్ద రాజు పూజరుల విడిది కేంద్రాన్ని ప్రారంభించిన పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

* మంగళవారం పగిడిద్ద రాజు పూజరుల విడిది  కేంద్రాన్ని పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 25 లక్షల రూపాయల నిధులతో నూతన విడిది కేంద్రాన్ని నిర్మించినట్లు మంత్రి  తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజకవర్గం పోనుగొండ్ల గ్రామం నుంచి  నేడు సాయంత్రం పెనక వంశీయుల పూజారుల ఆదివాసి గిరిజన సంస్తృతి సాంప్రదాయాల నడుమ మేడారనికి కాలి బాటన పగిడిద్ద రాజు పడిగే తో పూజారులు  పయనం కానున్నారు అని ఈ సందర్భంగా ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం  లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వం పూజరులా కోసం 25 లక్షల రూపాయల నిధులతో విడిది కేంద్రాన్ని నిర్మించింది అని తెలిపారు.

ఈ రోజు రాత్రి  పూజారులు విడిది కేంద్రం లో బస చేసి రేపు సాయంత్రం  మేడారానికి చేరుకుంటారని దీంతో జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతం ఔతుంది తెలిపారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈ ఈ అజయ్ కుమార్, అజిత్, తదితరులు పాల్గొన్నారు.మేడారం మీడియా సెంటర్ చే జారీ చేయనైనది.

More Press Releases